Nutan Prasad : నూతన్ ప్రసాద్ అసలు పేరేంటి..? ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది..?
నూతన్ ప్రసాద్ గానే పరిచయం. కానీ ఆయన అసలు పేరేంటి..? ఆయన ఎందుకు ఆ పేరు మార్చుకోవాల్సి వచ్చింది..? అనే విషయాలు మీకు తెలుసా..?
- By News Desk Published Date - 08:00 PM, Thu - 25 January 24

తెలుగు దివంగత నటుడు నూతన్ ప్రసాద్(Nutan Prasad).. వెండితెరపై, బుల్లితెరపై తనదైన స్టైల్ లో అలరించి ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించిన నూతన్ ప్రసాద్.. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) హీరోగా నటించిన ‘అందాల రాముడు’ సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే చాలా మందికి ఈయన నూతన్ ప్రసాద్ గానే పరిచయం. కానీ ఆయన అసలు పేరేంటి..? ఆయన ఎందుకు ఆ పేరు మార్చుకోవాల్సి వచ్చింది..? అనే విషయాలు మీకు తెలుసా..?
నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాదరావు(Vara Prasadarao). మొదటిలో నటించిన కొన్ని సినిమాల్లో ఈ పేరునే వేశారు. అయితే అప్పటిలో నూతన్ ప్రసాద్ కి మద్యం అలవాటు ఎక్కువగా ఉండేది. ఇక మద్యానికి బానిసై అనారోగ్యం పాలవ్వడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో మద్యం అలవాటుకి గుడ్ బై చెప్పేశారు. ఆ అలవాటుకి పూర్తిగా నిషేధం ప్రకటిస్తూ.. “నేను ఇప్పుడు వరప్రసాదరావుని కాదు కొత్త ప్రసాదరావుని” అని తనని తానే ప్రకటించుకుంటూ, తన పేరుని నూతన్ ప్రసాద్‌గా మార్చుకున్నారు. అలా ఆయనకి నూతన్ ప్రసాద్ అనే పేరు వచ్చింది.
కాగా నూతన్ ప్రసాద్ కి మంచి గుర్తింపు సంపాదించిపెట్టిన సినిమా అంటే ‘ముత్యాల ముగ్గు’. కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన ఈ చిత్రంలో.. నూతన్ ప్రసాద్, రావుగోపాల్ రావుతో కలిసి విలన్ గా నటించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో వరుస పెట్టి నెగటివ్ షేడ్ పాత్రల అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తరువాతే నూతన్ ప్రసాద్.. మద్యానికి బాగా బానిసయ్యారు. వందకి పైగా సినిమాల్లో నటించిన నూతన్ ప్రసాద్.. నాలుగు నంది అవార్డులను అందుకున్నారు. వీటిలో రెండు బెస్ట్ విలన్‌గా, రెండు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా అందుకున్నారు.
Also Read : Mahesh Babu : ఆ సినిమాలో నటించనని.. మహేష్ బాబు చెట్టెక్కి కూర్చున్నాడు..