HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Will Do Huge Action Scenes Without Dupe News Goes Vira

NTR: ఆ సినిమాలో ఎన్టీఆర్ డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారా.. రియల్లీ గ్రేట్ అంటూ?

  • Author : Vamsi Chowdary Korata Date : 25-03-2024 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr
Ntr

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో తారక్ ను అభిమానించే వారి సంఖ్య మరింత పెరిగింది. మూవీలో అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఇప్పుడు దేవర మూవీ చేస్తున్నారు.

అయితే దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. వాస్తవానికి ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా వేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు మేకర్స్. సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ఎన్టీఆర్ YRF స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నాడు.

హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ గా వార్ 2 సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడని సమాచారం. అయితే ఇప్పటికే వార్ 2 సినిమా ఒక షెడ్యూల్షూట్ కూడా పూర్తిచేసేసింది. దేవర షూట్ అయ్యాక ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో పాల్గొంటాడు. బాలీవుడ్ సినిమాల్లో, ముఖ్యంగా స్పై యూనివర్స్ సినిమాల్లో ఏ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయో అందరికి తెలిసిందే. భారీ యాక్షన్ సీక్వెన్స్ లని ఆల్మోస్ట్ డూప్స్ తోనే చేయిస్తారు. అయితే వార్ 2 సినిమాలో మాత్రం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ స్వయంగా యాక్షన్ సీన్స్ చేయబోతున్నారట. ఇటీవల వార్ 2 టీం ఈ విషయాన్ని తెలిపింది. డూప్స్ తో హీరోలు లేకుండానే షూట్ చేస్తున్నారని బాలీవుడ్ లో ఈ సినిమాపై వార్తలు రావడంతో దీనిపై స్పందిస్తూ.. ఈ సినిమాలో డూప్స్ ఎవరూ చెయ్యట్లేదు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్వయంగా యాక్షన్ సీన్స్ డూప్స్ లేకుండా చేస్తారు అని తెలిపినట్టు బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లో చూడాలని వార్ 2 సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • jr ntr
  • ntr
  • tollywood

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • My mother, Basavatarakam, passed away after battling cancer. This is the tearful story behind the Basavatarakam Hospital... Balayya gets emotional!

    Nandamuri Balakrishna: మా అమ్మ బసవతారకం క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారు. బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న ఆ కన్నీటి కథ ఇదే.. ఎమోషనల్ అయిన బాలయ్య!

Latest News

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

  • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

  • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd