NTR in Kantara 2 : కాంతార 2 లో ఎన్టీఆర్..ఆ ఛాన్స్ ఉందటారా..?
కాంతారా 2 లో ఎన్టీఆర్ ఉంటే మాత్రం ఆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న
- By Ramesh Published Date - 10:38 AM, Mon - 2 September 24

రక్షిత్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా సినిమా సృష్టించిన సంచలనాలు తెలిసిందే. 16 కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా 400 కోట్ల దాకా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కాంతార కి ప్రేక్షకులు నుంచి వచ్చిన రెస్పాన్స్ కి కాంతార ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. ఐతే కాంతార 2 పై ఉన్న అంచనాలు రోజు రోజుకి పెంచేలా మేకర్స్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది.
లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా కాంతారా 2 లో భాగం అవుతున్నారని టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రక్షిత్ శెట్టి, ఎన్టీఆర్ కలిసి ఉడిపి శ్రీకృష్ణ దేవాయలయ్యాన్ని సందర్శించారు. ఆ తర్వాత దుర్గామాత మందిరానికి వెళ్లారు. ఈ టైం లో ఎన్టీఆర్ ను రక్షిత్ తో నటించే అవకాశం ఉందా.. కాంతారా 2 లో నటిస్తారా అంటే రక్షిత్ అడిగితే తప్పకుండా చేస్తానని అన్నారు.
అంటే అన్నారు కానీ ఈ ఐడియా మాత్రం బాగుంది. కాంతారా 2 లో ఎన్టీఆర్ ఉంటే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. కాంతారా 2 ఇప్పటికే సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. రక్షిత్ శెట్టి కాంతారా 2 తో మరోసారి ప్రేక్షకులకు తన విశ్వరూపం (Viswarupam) చూపించాలని చూస్తున్నారు.
రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా చెప్పలేదు కానీ కాంతార 2 (Kantara 2) కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే ఊహాగానాలు ఐతే ఓకే కానీ ఎన్టీఆర్ లాంటి నటుడు సినిమాలో ఉంటే కచ్చితంగా రక్షిత్ శెట్టికి గట్టి పోటీ అన్నట్టే. జస్ట్ తారక్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మాత్రమే కానీ అసలు ఆ సినిమాలో ఎన్ టీ ఆర్ ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న తారక్ ఈ నెల చివరన ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది.
Also Read : Prabhas : ప్రభాస్ కోసం అనుకున్న కథ చరణ్ చేశాడా..?