War 2 Special Song Katrina Kaif : వార్ 2 స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా ఆమెను దించుతున్నారా..?
War 2 Special Song Katrina Kaif బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సౌత్ క్రేజీ స్టార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి వార్ 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ
- Author : Ramesh
Date : 17-05-2024 - 12:33 IST
Published By : Hashtagu Telugu Desk
War 2 Special Song Katrina Kaif బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సౌత్ క్రేజీ స్టార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి వార్ 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్, తారక్ ఇద్దరు నువ్వా నేనా అనే రేంజ్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. వార్ 2 సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తరహాలోనే ఈ సినిమాలో కూడా ఒక నాటు నాటు సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలాఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సినిమాలో సినిమాలో కియరా అద్వాని ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. ఇక లేటెస్ట్ గా సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కోసం సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని తీసుకున్నారని తెలుస్తుంది.
బీ టౌన్ ఆడియన్స్ ని రెండు దశాబ్ధాలుగా అలరిస్తూ వస్తున్న కత్రినా కైఫ్ ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో అమ్మడు వార్ 2 లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. వార్ 2 లో సరైన టైం లో ఒక అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేశారట. అయితే ఈ సాంగ్ లో కత్రినా కైఫ్ ఒక రేంజ్ లో రెచ్చిపోతుందని అంటున్నారు. బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ కు ఇదొక లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాతో పాటుగా ఎన్.టి.ఆర్ దేవర సినిమా కూడా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read : Vaishnavi Chaitanya : స్పిరిట్ లో బేబీ.. అంతకుమించిన అదృష్టమా..?