NTR Devara : దేవర ఓటీటీ టాక్ ఏంటి..?
NTR Devara సినిమా రిలీజైన ఫస్ట్ షోకి డివైడ్ టాక్ రాగా అలాంటి పరిస్థితుల నుంచి సినిమా 500 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టింది అంటే తారక్ మాస్ స్టామినా ఏంటన్నద్ది అర్ధం
- By Ramesh Published Date - 07:53 AM, Sun - 10 November 24

మాన్ ఆఫ్ మాసెస్ గా గ్లోబల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ (NTR) లేటెస్ట్ మూవీ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మోత మోగించింది. సినిమా రిలీజైన ఫస్ట్ షోకి డివైడ్ టాక్ రాగా అలాంటి పరిస్థితుల నుంచి సినిమా 500 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టింది అంటే తారక్ మాస్ స్టామినా ఏంటన్నద్ది అర్ధం చేసుకోవచ్చు. థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా ముగించుకున్న దేవర ఈమధ్యనే ఓటీటీలో రిలీజైంది.
నవంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో దేవర డిజిటల్ రిలీజ్ (Digital Release) కాగా సినిమాకు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో దేవర (Devara) సీన్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఐతే కొందరు మాత్రం సినిమాలో సినిమాటోగ్రఫీ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు. సినిమా కలర్ అంత బాగా లేదని ఎందుకో డల్ గా ఉందని అంటున్నారు.
సముద్రం బ్యాక్ డ్రాప్..
ఎంచుకున్న కథ అలాంటిది కాబట్టి అలాంటి కలర్ నే వాడాలి. ముఖ్యంగా సముద్రం బ్యాక్ డ్రాప్ కాబట్టి డిం లైట్ కామన్ అయ్యింది. ఐతే సినిమా కొంత అసంతృప్తి ఉందని కామెంట్స్ పెడుతున్నా మేజర్ ఆడియన్స్ ఓటీటీలో కూడా దేవర సినిమా సూపర్ అనేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమా మొదటి భాగం మంచి ట్విస్ట్ తో ఆపేశారు.
సెకండ్ పార్ట్ పై చాలా ఆసక్తి ఉంది. ఐతే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో బిజీగా ఉన్నాడు ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు. 2025లో ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేలా తారక్ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.