Janhvi Kapoor : జాన్వి సెంటిమెంట్.. దేవర ఏం జరుగుతుంది..?
కెరీర్ లో హిట్లు ఫ్లాపులు సహజమే కానీ జాన్వి ఇలా తెలుగు ఎంట్రీ ఇస్తున్న టైం లో బాలీవుడ్ లో ఫ్లాపులు పడటం కచ్చితంగా ఆమె కెరీర్ పై
- By Ramesh Published Date - 10:57 AM, Mon - 5 August 24

Janhvi Kapoor స్టార్ తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఓ పక్క అదరగొడుతూ ఇప్పుడు తెలుగు సినిమా ఆఫర్లను అందుకుంటుంది. ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న జాన్వి కపూర్ ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఒకేసారి రెండు భారీ సినిమాలతో జాన్వి టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఐతే జాన్వి తెలుగు తెరంగేట్రం బాగానే ఉన్నా హిందీలో ఆమె చేస్తున్న సినిమాల ఫలితాలు తేడా కొట్టడంతో అమ్మడు చేస్తున్న తెలుగు సినిమాల మీద ఆ ఎఫెక్ట్ పడేలా ఉంది.
జాన్వి కపూర్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఐతే కెరీర్ లో హిట్లు ఫ్లాపులు సహజమే కానీ జాన్వి ఇలా తెలుగు ఎంట్రీ ఇస్తున్న టైం లో బాలీవుడ్ లో ఫ్లాపులు పడటం కచ్చితంగా ఆమె కెరీర్ పై ప్రభావం చూపుతుంది. ఎన్టీఆర్ దేవరలో జాన్విని తీసుకుంది కూడా పాన్ ఇండియాలో ఆమె క్రేజ్ ఉపయోగపడుతుందని. కానీ హిందీలో ఫ్లాపుల్లో ఉన్న జాన్వి వల్ల దేవర మీద ఆ ఎఫెక్ట్ పడుతుందేమో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
Also Read : Article 370 Abrogation: అమర్‌నాథ్ యాత్ర వాయిదా, ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ దేవర (Devara) సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. కొరటాల శివ ఈ సినిమా టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. దేవర 1 సినిమాతో కచ్చితంగా అనుకున్న రేంజ్ హిట్ కొట్టాలనే కసితో చిత్ర యూనిట్ పనిచేస్తున్నారు. దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాతో జాన్వి మళ్లీ తిరిగి హిట్ ఫాం లోకి రావాలని చూస్తుంది.
మరి జాన్వి తెలుగు ఎంట్రీ దేవరకు కలిసి వస్తుందా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. ఎన్ టీ ఆర్ దేవర సినిమాలో తారక్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని అంతకుముంది ఎన్ టీ ఆర్ చెప్పిన కామెంట్స్ తెలిసిందే.