NTR Birthday : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా?
NTR Birthday : ఈ రెండు సినిమాలూ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ట్రీట్ ఇవ్వనుండగా, ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్‌తో పాటు ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేయనున్నారు
- By Sudheer Published Date - 01:41 PM, Tue - 6 May 25

మే (May) నెల అంటేనే నందమూరి అభిమానులకు (Nandhamuri Fans) పండుగ ప్రత్యేకించి మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో, ప్రతి సంవత్సరం తన అభిమానులకు ఏదో ఓ గిఫ్ట్ అందించే జూనియర్ ఎన్టీఆర్ (NTR), ఈసారి మాత్రం డబుల్ ధమాకాతో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతానికి రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న తారక్ … వాటి నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు సమాచారం.
తారక్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ ఇప్పటికే క్లైమాక్స్ దశకు చేరుకోగా, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ రెండు సినిమాలూ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ట్రీట్ ఇవ్వనుండగా, ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్‌తో పాటు ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టైలులో హీరో పుట్టినరోజుకు గ్లింప్స్ ఇవ్వడం అరుదైన విషయం అయినా, తారక్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ‘వార్ 2’ టీం కూడా అదే బాటలో నడుస్తోంది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వార్ 2’ వచ్చే ఆగస్టు 14న రిలీజ్ కానుండగా, ప్రశాంత్ నీల్ మూవీ 2026 జూన్ 25న విడుదలకు సిద్దమవుతోంది. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టుల గ్లింప్స్ ఒకేసారి రానుండటంతో మే 20న సోషల్ మీడియా అంతా “ఎన్టీఆర్ మానియా” తో మార్మోగనుంది. ఇప్పుడు మే 20 వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.