Mrunal Thakur : మృణాల్ ని పక్కన పెడుతున్నారెందుకు.. ఒక్క ఫ్లాప్ తో ఫేట్ మారిపోయిందే..!
Mrunal Thakur థర్డ్ సినిమాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ కెరీర్ లో అది ఫస్ట్ ఫ్లాప్. ఐతే ఆ ఫ్లాప్ వల్ల అమ్మై గ్రాఫ్ పడిపోయింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత ఎందుకో మృణాల్ కి ఆఫర్లు కూడా
- By Ramesh Published Date - 08:22 AM, Sat - 30 November 24

సీతారామం (Sitharamam) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా తో అమ్మౌ సూపర్ హిట్ అందుకుంది. తెలుగు తెర మీద కొత్త అందం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ నెక్స్ట్ సినిమా కూడా నానితో హాయ్ నాన్న చేసింది. హాయ్ నాన్న (Hi Nanna) సినిమా కూడా మృణాల్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. వరుస రెండు సూపర్ హిట్లు పడిన తర్వాత మృణాల్ (Mrunal Thakur) క్రేజ్ డబుల్ అయ్యింది.
ఐతే థర్డ్ సినిమాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ కెరీర్ లో అది ఫస్ట్ ఫ్లాప్. ఐతే ఆ ఫ్లాప్ వల్ల అమ్మై గ్రాఫ్ పడిపోయింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత ఎందుకో మృణాల్ కి ఆఫర్లు కూడా దూరమయ్యాయి. తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు. మరి మృణాల్ కావాలని వచ్చిన అవకాశాలను నో చెబుతుందా అన్నది తెలియదు కానీ మృణాల్ కి లక్ అలా కలిసి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది.
బీ టౌన్ ఆడియన్స్ ని..
మృణాల్ ఠాకూర్ ఓ పక్క తెలుగులో నటిస్తూనే బాలీవుడ్ లో దూసుకెళ్తుంది. అమ్మడు రాబోతున్న సినిమాలతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. ఈమధ్యనే అమ్మడు కోలీవుడ్ నుంచి ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. మరి సౌత్ లో తన క్రేజ్ ని కొనసాగించేలా మృణాల్ మరిన్ని ఆఫర్లు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
తను చేసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా మృణాల్ మాత్రం ది బెస్ట్ అందించడంలో సక్సెస్ అవుతుంది. మరి మృణాల్ నెక్స్ట్ తెలుగు సినిమా ఏదవుతుంది అన్నది చూడాలి.
Also Read : Hypnic Jerk Symptoms: మీరు నిద్రపోతున్నప్పుడు ఇలా చేస్తున్నారా..?