Prabhas Kalki : రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి ఒక్కటే.. ఆరోజు మరో సినిమాకు నో ఛాన్స్..?
Prabhas Kalki ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో కల్కి ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న
- Author : Ramesh
Date : 22-06-2024 - 2:56 IST
Published By : Hashtagu Telugu Desk
Prabhas Kalki ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో కల్కి ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో వరల్డ్ సినీ లవర్స్ కి తెలుగు సినిమా స్టామినా చూపించేలా చేస్తున్నారు. 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా పై తెలుగు రెండు రాష్ట్రాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే ఈ సినిమా రిలీజ్ టైం లో తెలుగులో మరో సినిమా వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది.
కల్కి రిలీజ్ రోజు అంటే జూన్ 27న సాధ్యమైనంతవరకు తెలుగు రెండు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో కేవలం కల్కి మాత్రమే ప్రదర్శించబడుతుందని టాక్. అదే జరిగితే మాత్రం కల్కి ఖాతాలో మరో సూపర్ రికార్డ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కల్కి సినిమా కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉండగా ఫస్ట్ డే భారీ టార్గెట్ ప్లాన్ చేశారు మేకర్స్.
రిలీజ్ రోజు దాదాపు అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ లో కల్కి మాత్రమే ఆడేలా చూస్తున్నారట. అలా చేస్తే మాత్రం కల్కి ఫస్ట్ డే వసూళ్లు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి కల్కి రిలీజ్ రోజు మరో సినిమా రిలీజ్ ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని ఇలా భారీ స్టార్ కాస్ట్ తో నాగ్ అశ్విన్ ఒక అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ట్రైలర్స్ కూడా సినిమాపై అంచనాలను డబుల్ చేశాయి.
Also Read : Meenakshi Chaudhary : కమెడియన్ సరసన ఛాన్స్.. హీరోయిన్ ప్లాన్ ఏంటో..?