Nitin Srileela : ఎక్స్ ట్రా కాంబో.. ఈసారైనా..?
Nitin Srileela నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో డైరెక్టర్ కాంబో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని
- By Ramesh Published Date - 09:15 AM, Sun - 16 June 24
![Nitin Srileela : ఎక్స్ ట్రా కాంబో.. ఈసారైనా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Nitin-Srileela-Extra-Combo-Repeating-for-Rabinhood.jpg)
Nitin Srileela నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో డైరెక్టర్ కాంబో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో ముందు రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా ఆమె వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ఛాన్స్ లేకుండాపోయింది. అందుకే ఫైనల్ గా రాబిన్ హుడ్ కోసం శ్రీలీలని లాక్ చేశారు.
ఐతే ఆల్రెడీ నితిన్ తో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో శ్రీలీల నటించింది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్లింది. మరి ఎక్స్ ట్రా కాంబో ఈసారి మళ్లీ రాబిన్ హుడ్ అంటూ వస్తున్నారు. ఈసారైనా ఈ కాంబో హిట్ కొడతారా లేదా అన్నది చూడాలి.
ఛలో, భీష్మ రెండు సినిమాలతో డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న వెంకీ కుడుముల రాబిన్ హుడ్ ని కూడా ఆ రేంజ్ కు తగినట్టుగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. భీష్మలో నితిన్ ని కొత్తగా చూపించిన వెంకీ ఈ సినిమాలో కూడా అలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇంతకీ రాబిన్ హుడ్ ఎలా ఉంటాడన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
Also Read : Raviteja : దేవర ముంగిట నేనుంటా అంటున్న మాస్ రాజా..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Pawan Kalyan: రేపు పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు, ప్రముఖుల భేటీ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/pawan-chanbar-chage.jpg)
Pawan Kalyan: రేపు పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు, ప్రముఖుల భేటీ
Pawan Kalyan: రేపు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని విజయవాడ క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ నిర్మాతలు, ప్రముఖులు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలను వివరించడంతోపాటు.., తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కలవనున్నారు. ముఖ్యంగా స�