HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nayanthara Mookuthi Amman 2 Movie Pooja Launch

Ammoru Thalli 2: నయనతార అమ్మోరు తల్లి 2 పనులు మొదలు.. ఘనంగా పూజా కార్యక్రమాలు!

నయనతార నటిస్తున్న అమ్మోరు తల్లి 2 సినిమా రెండో భాగం షూటింగ్ తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా మొదలుపెట్టారు మూవీ మేకర్స్. అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Author : Anshu Date : 07-03-2025 - 9:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
138 2
138 2

ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా మెయిన్ పాత్రలో నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్. ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది. ఇందులో నయనతార అమ్మవారి పాత్రలో నటించింది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పార్ట్ 2 తీయాలని ఐసరి గణేష్ ఫిక్స్ అయ్యారు. మూకుత్తి అమ్మన్ 2 బాధ్యతల్ని డైరెక్టర్ సుందర్ సికి అప్పగించారు.

కాగా అమ్మోరు తల్లి 2 సినిమా దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో రెడీ అవుతోందట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఒక చిన్న గుడి లాంటి సెట్ కూడా వేశారు. పూజా కార్యక్రమానికి డైరెక్టర్ సుందర్ సి, ప్రొడ్యూసర్ ఐసరి గణేష్ చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. హీరోయిన్ నయనతార లేటుగా వచ్చినా మాస్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా మొదలైన సందర్భంగా ఈ ఈవెంట్‌ లో సుందర్ సి మాట్లాడుతూ సినిమాలో నటించే మిగతా నటీనటుల్ని స్టేజ్‌ పై పరిచయం చేశారు.

రెజీనా కసెండ్రా, ఇనియా, యోగిబాబు, సింగం పులి, విచ్చు విశ్వనాథ్ లాంటి పెద్ద స్టార్ కాస్ట్ సినిమాలో ఉన్నారని సుందర్ సి తెలిపారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌ గా నటిస్తున్నారని తెలిపారు. ముందుగా ఈ విలన్ పాత్రలో అరుణ్ విజయ్ నటిస్తారని అనుకున్నారు. కానీ శాలరీ విషయంలో సెట్ కాకపోవడంతో దునియా విజయ్‌ ని తీసుకున్నారట. అయితే అమ్మోరు తల్లి పార్ట్ వన్ చిత్రీకరించిన సమయంలో నయనతార ఉపవాసం ఉండి నటించిందట. ఇప్పుడు కూడా అదే విధంగా ఉపవాసం ఉండి నటించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పూజ చేసిన వారం ముందు నుంచే తన పిల్లలతో కలిసి నయనతార ఉపవాసం స్టార్ట్ చేసిందని ప్రొడ్యూసర్ ఐసరి గణేష్ చెప్పారు. ఈ సినిమా పూజలో ఫస్ట్ సీన్ కూడా తీశారు. నయనతార మూకుత్తి అమ్మన్‌ ను దర్శనం చేసుకునే సీన్‌ ను డైరెక్టర్ సుందర్ సి షూట్ చేశారట. ఈ సినిమా షూటింగ్ మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతుందట. ఐసరి గణేష్ వేల్స్ ఫిల్మ్స్‌ తో కలిసి నయనతార రౌడీ పిక్చర్స్, ఖుష్బూ సుందర్ సికి చెందిన అవని సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ammoru Thalli 2
  • Ammoru Thalli 2 movie
  • mookuthi amman 2movie
  • Nayanatara
  • pooja
  • tollywood

Related News

To get relief from the affliction caused by Saturn, one must offer a specific item to Lord Saneeswara!

Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

మామూలుగా శని దేవుడిని కర్మధాత అని పిలుస్తుంటారు. అంటే మనం చేసే మంచి చెడుల బట్టి ఫలితాలను ఇస్తాడని భక్తులు నమ్ముతుంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను అందించడంతో పాటు ఆయన అనుగ్రహం కలుగుతుందట. చెడు పనులు చేస్తూ, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడే వారిని ఆయన కష్టాలకు గురి చేస్తాడట. అలా మంచి చెడులను కలిపి ఇస్తూ ఉంటాడు శనీశ్వరుడు. శని దేవుడు జాతకంలో అశుభ స్

  • As for Samantha, the gem of our family, she is doing...

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd