Nayanthara Wedding: నెట్ ఫ్లిక్స్ లో నయన్-విఘ్నేష్ పెళ్లి ప్రీమియర్?
అందాల తార నయనతార..తన ప్రియుడు విఘ్నేష్ శివన్ను పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న ఈ జంట వివాహం వైభవంగా జరగనుంది.
- Author : hashtagu
Date : 05-06-2022 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
అందాల తార నయనతార..తన ప్రియుడు విఘ్నేష్ శివన్ను పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న ఈ జంట వివాహం వైభవంగా జరగనుంది. మహాబలిపురంలోని ఫైవ్ స్టార్ హోటల్లో హిందూ సంప్రదాయాల ప్రకారం…ఈ ముద్దుగుమ్మ వివాహనం జరగున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7గంటల మధ్య నయన్ మెడలో విఘ్నేష్ మూడుముళ్లు వేయనున్నట్లు సమాచారం. అదే వేదికపై జూన్ 8 సాయంత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు…రాజకీయ నాయకుల కోసం రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ఈ జంట పలువురిని గ్రాండ్ వెడ్డింగ్ కు ఆహ్వానించేందుకు కలుస్తున్నారు. జూన్ 9, 2022న జరగనున్న తమ పెళ్లికి ఆహ్వానించేందుకు శనివారం తమినాడు సీఎం ఎంకే స్టాలిన్ కలిశారు నయన్, విఘ్నేష్. ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను కూడా ఆహ్వానించారు. ఈ వేడుకకు పలువురు స్టార్ హీరోలతోపాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరుకాన్నట్లు సమాచారం.
కాగా వీరికి పెళ్లికి స్ట్రీమింగ్ హక్కులను ప్రత్యేకంగా నెట్ ఫ్లిక్స్ లో చిత్రీకరించి ప్రీమియర్ గా ప్రదర్శిస్తారన్నా టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ కు దర్శకత్వం వహించే బాధ్యతను గౌతం మీనన్ తీసుకున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే ఓటీటీలో స్టార్ కపూల్ మ్యారేజ్ ను ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈవిధంగా చేయడం దక్షిణ భారత్ చలన చిత్ర పరిశ్రమలోనే తొలిసారి అవుతుంది. అయితే ఈ వార్త ఇంకా అధికారంగా ప్రకటించలేదు.