Nayanthara Hospitalised: హాస్పిటల్ లో నయనతార.. అసలు విషయం అదేనా!
తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ని సౌత్ బ్యూటీ నయనతార ఇటీవలనే పెళ్లి చేసుకుంది.
- By Balu J Published Date - 01:04 PM, Thu - 11 August 22

తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ని సౌత్ బ్యూటీ నయనతార ఇటీవలనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ జంట తమకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తూ.. మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బుధవారం చెన్నైలో నయనతార ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు తీవ్ర వాంతులు వచ్చినట్లు సమాచారం. ఆమెను కొన్ని గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. స్కిన్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స పొందుతున్నట్లు రిపోర్టర్స్ చెబుతున్నాయి.
ఈ వార్త నయనతార అభిమానులను ఆందోళనకు గురిచేసినప్పటికీ, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం జూన్ 9 న మహాబలిపురంలో అత్యంత సన్నిహితంగా జరిగింది. షారుఖ్ ఖాన్, రజనీకాంత్ సహా సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు మ్యారేజ్ కు అటెండ్ అయ్యారు. నయనతార చివరిసారిగా ‘కాతు వాకులా రెండు కాదల్’ సినిమాలో కనిపించింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలో నటిస్తోంది.