Malli Pelli : మళ్ళీ పెళ్లి టీజర్ చూశారా? నరేష్ – పవిత్ర రియల్ కథనే సినిమా తీస్తున్నారుగా..
నరేష్ -పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో నరేష్ సొంత నిర్మాణంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
- By News Desk Published Date - 09:30 PM, Fri - 21 April 23

టాలీవుడ్(Tollywood) లో గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్(Naresh) – పవిత్ర(Pavithra) వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో తిరుగుతుండటంతో ఈ జంట బాగా వైరల్ అయ్యారు. నరేష్ – పవిత్ర కొన్నాళ్ల క్రితం లిప్ కిస్ ఇచ్చుకున్న వీడియోని రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీడియో, ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి ఇదంతా ఓ సినిమా కోసం అని ఇండైరెక్ట్ గా చెప్పారు.
నరేష్ -పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో నరేష్ సొంత నిర్మాణంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే నరేష్ – పవిత్ర రియల్ లైఫ్ లో జరిగిందే సినిమా తీస్తున్నారు. టీజర్ లో.. నరేష్, పవిత్ర హోటల్ లో ఉంటే మూడో భార్య అక్కడికి రావడం, మూడో భార్య మీడియా ముందుకు వెళ్లడం, నరేష్ – పవిత్ర ఎంజాయ్ చేయడం చూపించారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే నరేష్ – పవిత్ర రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. ఈ సినిమాని మే తెలుగు, కన్నడలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మళ్ళీ పెళ్లి టీజర్ వైరల్ అవ్వగా మరోసారి నరేష్ – పవిత్ర వార్తల్లో నిలిచారు.
Also Read : Ugram Trailer : వామ్మో అల్లరోడు ఇంత విధ్వంసమా?? ఉగ్రం ట్రైలర్ రిలీజ్..