Saripoda Shanivaram 3 Days Collections : 3 రోజులు 50 కోట్లు.. నాని సరిపోదా కలెక్షన్స్..!
నాని మాస్ సంభవం ఏంటన్నది ఈ వసూళ్లను చూస్తే అర్ధమవుతుంది. మొదటి నుంచి నాని ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని బల్లగుద్ది
- By Ramesh Published Date - 06:05 PM, Sun - 1 September 24

న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఆగష్టు 29న రిలీజై సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచి హిట్ టాక్ వచ్చింది. అందుకు తగినట్టుగానే కలెక్షన్స్ ఉన్నాయి.
నాని (Nani) సరిపోదా శనివారం సినిమా ఫస్ట్ డే 25 కోట్ల దాకా కలెక్ట్ చేయగా 3 రోజుల్లో 52 కోట్ల పైన కలెక్షన్స్ (Collections) రాబట్టింది. నాని మాస్ సంభవం ఏంటన్నది ఈ వసూళ్లను చూస్తే అర్ధమవుతుంది. మొదటి నుంచి నాని ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని బల్లగుద్ది మరీ చెబుతూ వచ్చాడు. నాని నమ్మకాన్ని ఆడియన్స్ నిలబెట్టారు.
ఈ సినిమాలో నానికి ఈక్వల్ గా ఎస్ జే సూర్య (SJ Surya) పాత్ర అదరగొట్టేసింది. సినిమాలో విలన్ పాత్రలో సూర్య నానికి ఏమాత్రం తగ్గకుండా మంచి పోటీ ఇచ్చారు. నాని సరిపోదా శనివారం న్యాచురల్ స్టార్ కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా నిలిచేలా ఉంది. ఐతే సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా భారీ వర్షాల వల్ల కొంత వసూళ్ల మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణా లో సరిపోదా శనివారం (Saripoda Shanivaram) సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయగా ఇతర భాషల్లో సోసోగానే రెస్పాన్స్ అందుకుంటుంది.
Also Read : Hussain Sagar : హుస్సేన్ సాగర్‌కు భారీగా ఇన్ ఫ్లో… నాలుగు స్లూయిస్ గేట్లు తెరిచి నీటి విడుదల