Nani : నాని ప్యారడైజ్.. అందులో నిజమెంత..?
Nani నాని పారడైజ్ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఇంకా మరిన్ని డీటైల్స్ నాని అండ్ టీం త్వరలో అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. నాని మాత్రం పారడైజ్ సినిమాను సంథింగ్ స్పెషల్ గా
- By Ramesh Published Date - 10:52 PM, Mon - 3 February 25

Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. తనే నిర్మాతగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో పారడైజ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైనట్టు తెలుస్తుంది.
నాని పారడైజ్ సినిమాతో మరోసారి దసరా రిజల్ట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఐతే నాని పారడైజ్ కు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా కు అనిరుద్ మ్యూజిక్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
రెండు భాగాలుగా ప్లాన్..
ఐతే ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నాని కూడా ఈ సినిమా కోసం తన లుక్ కూడా కొత్తగా ఉండేలా చూస్తున్నాడట. నాని శ్రీకాంత్ మళ్లీ కలుస్తున్నారని తెలియగానే న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఏర్పడింది.
నాని పారడైజ్ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఇంకా మరిన్ని డీటైల్స్ నాని అండ్ టీం త్వరలో అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. నాని మాత్రం పారడైజ్ సినిమాను సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పారడైస్ సినిమా ఇంకా మొదలు పెట్టనేలేదు శ్రీకాంత్ తన థర్డ్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ఫిక్స్ చేసుకున్నాడు. ఐతే ఈ సినిమా నిర్మాతగా నాని వ్యవహరించడం విశేషం.