Nani – Sam : ఎయిర్ పోర్ట్ లో సామ్ ను చూసి నాని షాక్
- By Sudheer Published Date - 08:53 PM, Fri - 23 August 24

న్యాచురల్ స్టార్ నాని (Nani) వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం ( Saripoda Shanivaram ). ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ కొంతమంది ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తూ సినిమా చేసాడు. ఈ మూవీని RRR ఫేమ్ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఇందులో విలన్ పాత్రలో నటించడం విశేషం. ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమాను అన్ని భాషల్లో నాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై లో చిత్ర ప్రమోషన్ లో పాల్గొనేందుకు వెళ్తున్న నాని కి సమంత ఎదురు పడింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సమంత ను చూసి నాని షాక్ అయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
హాయ్ సామ్ ఎలా ఉన్నావు..అంటూ పలకరించగా..సామ్ (Samantha) కూడా చాలా సరదాగా నానితో మాట్లాడింది. అయితే ముంబై దేనికి అని సమంత అడగడంతో సినిమా రిలీజ్ ఉంది అంటూ సరిపోదా శనివారం విశేషాలు పంచుకున్నాడు. అయితే సమంత అవునా నాకు తెలీదు.. నేను చూడలేదు.. ఇప్పుడే ట్రైలర్ చూస్తా అంటూ ఫోన్ తీశారు. ఇలా వీరిద్దరూ అనుకోకుండా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సామ్-నాని కలిసినందుకు పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి కలయికలో ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలు ఆడియన్స్‌న బాగా ఆకట్టుకున్నాయి. దీంతో వీరి కాంబో కోసం ఎదురుచూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక సామ్ విషయానికి వస్తే ..తెలుగు లో పెద్దగా ఆఫర్లు లేనప్పటికీ..వరుణ్ ధావన్‌తో కలిసి సామ్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ చేసింది. ఇది ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబరు 7న విడుదల కానుంది. అలానే ‘మా ఇంటి బంగారం’ అంటూ ఓ చిత్రాన్ని కొన్ని నెలల క్రితమే సామ్ ప్రకటించింది. దీనికి ఆమె నిర్మాత.
Varun and Nithya’s reunion at Hyderabad airport today! ❤️ 🫰🏻@Samanthaprabhu2 @NameisNani #SaripodhaaSanivaaram #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/nV609BERPV
— Samantha FC || TWTS™ (@Teamtwts2) August 22, 2024
Read Also : Telangana PCC Chief : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్