Nani : నాని సినిమా రేసులో ఆ ఇద్దరు హీరోయిన్స్..?
Nani న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. సరిపోదా శనివారం నిర్మాతలే
- By Ramesh Published Date - 11:20 AM, Mon - 24 June 24

Nani న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. సరిపోదా శనివారం నిర్మాతలే సుజిత్ సినిమాను నిర్మించే ప్లాన్ చేశారు కానీ బడ్జెట్ విషయంలో ఇంకా ఫైనల్ లెక్కలు తేలలేదని టాక్. ఇదిలాఉంటే నాని మరోసారి దసరా డైరెక్టర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ దసరా కాంబినేషన్ లో మరో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
దసరా నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా పీరియాడికల్ కథగా రాబోతుందని టాక్. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా మళ్లీ కీర్తి సురేష్ నే తీసుకుటారా లేదా మరో హీరోయిన్ కి వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే కీర్తి సురేష్ కాకపోతే మాత్రం ఆ ఛాన్స్ సాయి పల్లవికి ఇస్తారని అంటున్నారు.
సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరిలో ఎవరు చేసినా సరే అది నానితో వారు చేసే హ్యాట్రిక్ సినిమా అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ సాయి పల్లవి ఎం.సి.ఏ, శ్యాం సింగ రాయ్ సినిమా చేశాడు. కీర్తి సురేష్ తో నేను లోకల్, దసరా చేశాడు. సో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని చేసే సినిమాలో ఇద్దరిలో ఎవరు చేసినా వారితో నానికి హ్యాట్రిక్ సినిమా అవుతుంది.
Also Read : Kalki Tickets : ప్రభాస్ కల్కి బదులు రాజశేఖర్ కల్కి బుక్ చేసుకున్నారు..?