Kalki Tickets : ప్రభాస్ కల్కి బదులు రాజశేఖర్ కల్కి బుక్ చేసుకున్నారు..?
Kalki Tickets రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా గురువారం రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాడు
- By Ramesh Published Date - 11:03 AM, Mon - 24 June 24

Kalki Tickets రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా గురువారం రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక ఆదివారం సాయంత్రం నుంచి ఆన్ లైన్ లో టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఐతే కల్కి అని కబబడగానే అది ఎవరి సినిమా ఏంటన్నది చూడకుండానే కొందరు బుక్ చేసుకున్నారు. కల్కి సినిమా టికెట్స్ దొరికాయని సంబరపడ్డారు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్లు ప్రభాస్ కల్కి బదులుగా రాజశేఖర్ కల్కి సినిమా టికెట్స్ బుక్ చేసుకున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తో కల్కి సినిమా చేశారు. ఆ సినిమా ఎప్పుడో రిలీజైంది కానీ బుక్ మై షోలో కల్కి అని కొడితే ఆ సినిమా టికెట్స్ కనిపించాయి.
ప్రభాస్ కల్కినే అయ్యుంటుంది అని సినిమా టికెట్స్ బుక్ చేస్తే తీరా బుక్ అయ్యింది రాజశేఖర్ కల్కి సినిమాకని తర్వాత తెలిసింది. ఐతే రాజశేఖర్ కల్కి ఇప్పుడు ఎక్కడ ఆడట్లేదు. మరి అలాంటిది టికెట్స్ ఎలా ఇస్తారని ఆరా తీయగా బుక్ మై షోలో టెక్నికల్ లోపం వల్ల అలా జరిగిందని చెప్పారు. ప్రభాస్ కల్కి బదులుగా రాజశేఖర్ కల్కి సినిమా టికెట్స్ బుక్ చేసుకున్నామని ఫీల్ అవుతున్న వారంతా బుక్ మై షో ప్రకటన వల్ల హమ్మయ్య అనుకున్నారు.
మొత్తానికి కల్కి టైటిల్ ఇలా కన్ ఫ్యూజ్ చేసిందని చెప్పొచ్చు. ఊహించినట్టుగానే కల్కి సినిమాఉ ప్రీ బుకింగ్స్ అదిరిపోయాయి. సినిమా ఫస్ట్ డే నే భారీ వసూళ్లను రాబట్టేలా ఉందని తెలుస్తుంది.