Tollywood : కోట్లు అవసరం లేదు..ప్రేక్షకులు నచ్చితే చాలు – హీరో నాని
ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది అని విలేఖరి అడిగిన ప్రశ్నకు నాని ఊహించని సమాధానం ఇచ్చాడు
- By Sudheer Published Date - 02:48 PM, Sat - 24 August 24

నేచురల్ స్టార్ నాని..డైరెక్టర్ గా రాణించాలని చిత్రసీమలో అడుగుపెట్టిన నాని..హీరోగా మారిపోయారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేసాడు. ఆ తర్వాత అష్టా చమ్మా అనే సినిమాలో హీరోగా నటించి..ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ నేచురల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నాని గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం నాని (Nani) వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం ( Saripoda Shanivaram ) సినిమా చేసాడు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ‘అంటే సుందరానికీ’ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ పర్వాలేదు అనిపించుకుంది. అయినప్పటికీ నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తూ సినిమా చేసాడు. ఈ మూవీని RRR ఫేమ్ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఇందులో విలన్ పాత్రలో నటించడం విశేషం. ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమాను అన్ని భాషల్లో నాని ప్రమోట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు చేసారు నాని. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది అని విలేఖరి అడిగిన ప్రశ్నకు నాని ఊహించని సమాధానం ఇచ్చాడు. తన కెరీర్ బిగినింగ్ నుండి ప్రేక్షకులని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, పాన్ ఇండియా లాంటివి ఇప్పుడు అంటున్నారు గాని,.. ఒకప్పుడు కూడా దేశ వ్యాప్తంగా మన తెలుగు సినిమాలు కూడా బాగా ఆడాయని చెప్పుకొచ్చాడు. అయితే తనకు వందల కోట్ల సినిమాలు అక్కర్లేదని.. తన సినిమాలతో ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తే తనకంతే చాలని, తన సినిమాలు తాను చేస్తూ పోతే ఎదో ఒకరోజు పాన్ ఇండియా రేంజ్ వస్తుందని చెప్పుకొచ్చాడు.
Read Also : Triple Talaq : మోడీ, యోగిలను పొగిడిందని భార్యకు ట్రిపుల్ తలాఖ్