Nandamuri Mokshagna : మోక్షజ్ఞ రెడీ అవుతున్నాడు.. త్వరలోనే షూట్.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుందని అధికారికంగా ప్రకటించారు.
- Author : News Desk
Date : 29-11-2024 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
Nandamuri Mokshagna : బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణలకు ఇటీవలే శుభం కార్డు పడింది. కొన్ని రోజుల క్రితమే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుందని అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే వచ్చిన మోక్షజ్ఞ కొత్త లుక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా నేడు ప్రశాంత్ వర్మ సింబా వచ్చేస్తున్నాడు.. మీరు యాక్షన్ కి రెడీగా ఉన్నారా అని మోక్షజ్ఞ కొత్త ఫోటో షేర్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
టాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని, మోక్షజ్ఞ ఆల్రెడీ వర్క్ షాప్స్ కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. అందుకే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటో షేర్ చేసి సింబా వస్తున్నాడు అంటూ పోస్ట్ చేసాడు. ఈ సినిమా ఓపెనింగ్ పుష్ప రిలీజ్ రోజు డిసెంబర్ 5న జరగనుందని సమాచారం.
ఇక ఈ సినిమా కూడా మైథలాజికల్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుంది. దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా త్వరగా మొదలుపెట్టి త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.
Ready for some action? @MokshNandamuri 💥💥💥#SIMBAisCOMING pic.twitter.com/dep3A1Whv9
— Prasanth Varma (@PrasanthVarma) November 29, 2024
Also Read : Pushpa 2 Pre Release Event : మల్లారెడ్డి కాలేజీ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుక