Nagarjuna Defamation Case: నేడు పరువు నష్టం కేసు విచారణ.. మంత్రికి ఈ శిక్షలు పడొచ్చు!
ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో పరువునష్టం దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
- Author : Gopichand
Date : 04-10-2024 - 10:13 IST
Published By : Hashtagu Telugu Desk
Nagarjuna Defamation Case: మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా (Nagarjuna Defamation Case) వేసిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రిపై చర్యలు కోరుతూ నాంపల్లి కోర్టులో గురువారం అక్కినేని కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు. అయితే నాగార్జున నాగార్జున పిటిషన్ ఈరోజు అంటే శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు విచారణకు వస్తే కోర్టు.. మంత్రికి శిక్ష విధిస్తుందో..? లేక మందలిస్తుందో వేచి చూడాలి.
ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో పరువునష్టం దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. IPC సెక్షన్ 500 ప్రకారం ఈ శిక్షలుంటాయి. గతంలో మోదీ పేరుపై చేసిన కామెంట్స్‌కు గానూ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే దానిపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్‌కు 15రోజుల జైలు శిక్ష పడింది.
Also Read: Kejriwal New Address: కేజ్రీవాల్ కేరాఫ్ అడ్రస్ మారింది, ఈ రోజే సీఎం నివాసం ఖాళీ
కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్ స్పందన
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్ స్పందించారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవి. ప్రజలచే ఎన్నుకోబడిన నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దిగ్భ్రాంతికరం. ఇలాంటి ప్రవర్తనను మేము సహించం’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ప్రభాస్ పోస్ట్ చేశారు.
అసలేం జరిగింది..?
మంత్రి కొండా సురేఖ ఇటీవల ఓ సందర్భంలో సమంత- నాగ చైతన్యల విడాకులకు కారణం కేటీఆరే అని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా సమంతను కేటీఆర్ దగ్గరకు పంపమన్నారని, దానికి నాగార్జున కుటుంబం కూడా వత్తాసు పలికినట్లు ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత వీటిపై స్పందించిన అక్కినేని కుటుంబం లీగల్ పరంగా యాక్షన్ తీసుకుంది. రాజకీయ లబ్ధి కోసం మా పేర్లు ఎలా ఉపయోగిస్తారంటూ నాగార్జున సైతం సిరీయస్ అయ్యారు. ఇకపోతే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్ సైతం ఖండించింది. ఆమెపై పలు రకాల చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను పర్సనల్‌గా కోరినట్లు కూడా సమాచారం.