Naga Chaitanya Twitter Account : నాగ చైతన్య కు మరో షాక్ ..?
Naga Chaitanya Twitter Account : నేను 50 డాలర్లకు 100 బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశాను. ఇక ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్ డాలర్లు. ఇప్పుడు గివ్ అవే ఇవ్వాలా వద్దా ఓట్ చేయండి
- By Sudheer Published Date - 05:49 PM, Wed - 9 October 24

అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న N కన్వెన్షన్ (N Convention Demolition) అక్రమ నిర్మాణమని చెప్పి తెలంగాణ సర్కార్ కూల్చివేసింది..ఆ తర్వాత నాగార్జున పై మంత్రి కొండా సురేఖ కీలక ఆరోపణలు (Minister Konda Surekha Comments) చేసి నాగ్ పరువు తీసింది. ఇదిలా ఉండగానే ఈరోజు నాగ చైతన్య అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ కు గురైనట్లు (Naga Chaitanya Twitter Account Hacked) అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి కారణం ఆయన ట్విట్టర్ అకౌంట్ నుండి వచ్చినా పోస్ట్.
‘నేను 50 డాలర్లకు 100 బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశాను. ఇక ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్ డాలర్లు. ఇప్పుడు గివ్ అవే ఇవ్వాలా వద్దా ఓట్ చేయండి’ అంటూ తన ఫ్యాన్స్ ను నాగ చైతన్య కోరినట్టుగా ఆయన అకౌంట్ నుంచి వచ్చిన ఆ ట్వీట్ లో ఉంది. అయితే ఇది నిజంగానే నాగ చైతన్య చేసాడేమో అనుకుని ఇప్పటికే చాలామంది ఫాలోవర్లు ఓటింగ్ కూడా చేశారు. కానీ నిజానికి ఇలాంటి బిట్ కాయిన్ వ్యవహారాల గురించి ఎక్కువగా హ్యాకర్లు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో ఇప్పుడు నాగ చైతన్య ఎకౌంట్ హ్యాక్ అయ్యిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ట్వీట్ దాదాపు 24 గంటలపాటు ఆయన అకౌంట్లో దర్శనం ఇచ్చింది. కాసేపటి క్రితమే దాన్ని డిలీట్ చేశారు. 2017లో నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా, ఆయనకు ప్రస్తుతానికి 2.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి ఈ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ పై నాగ చైతన్య ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also : YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్