Kalki Secrets: కల్కి సీక్రెట్స్ బయటపెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్
సలార్ సినిమాతో భారీ విజయం అందుకున్న యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్
- By Praveen Aluthuru Published Date - 03:03 PM, Sat - 30 December 23
Kalki Secrets: సలార్ సినిమాతో భారీ విజయం అందుకున్న యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న కల్కి టీజర్ ఆమధ్య రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత కల్కి సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఇది టాలీవుడ్ సినిమానా.. హాలీవుడ్ సినిమానా.. అనే డౌట్ వచ్చింది.
టీజర్ తర్వాత కల్కి గురించి మరో అప్ డేట్ రాలేదు. తాజాగా నాగ్ అశ్విన్ ముంబాయిలో కల్కి సినిమా గురించి మీడియా ఇంట్రాక్షన్ ఏర్పాటు చేశారు. అందులో కల్కి గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. పురాణాలు ప్లస్ సైన్స్ కలిపి కల్కి కథను రెడీ చేశానని.. పురాణాల్లో ఆయుధాలకు ఇప్పటి టెక్నాలిజీని మిక్స్ చేసి కల్కి కథ రాసుకున్నానని చెప్పారు నాగ్ అశ్శిన్. అలాగే పురాణాల్లో కొన్ని పాత్రలను తీసుకుని.. కల్కిలో కథానాయకుడు మిగిలిన పాత్రలను డిజైన్ చేశానని చెప్పారు.
అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వద్ధామ పాత్రను పోలి ఉంటుందట. అలాగే ప్రభాస్ కల్కి అవతారం ఎత్తబోతున్నాడని.. కమల్ హాసన్ పాత్ర కూడా పురాణాల్లోంచి తీసుకున్నదే అని తెలుస్తుంది. అయితే ఈ కథ రెండు భాగాలుగా రాబోతుందట. కాగా ఇదే విషయంపై అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి ఎన్ని భాగాలుగా రానుందో క్లారిటీ లేదు. త్వరలోనే ఈ చిత్రాన్ని ఎన్ని పార్టులుగా తీస్తున్నామనేది క్లారిటీ ఇస్తామని నాగ్ అశ్విన్ చెప్పాడు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగితే.. 93 రోజుల్లో అని చెప్పారు. దీనిని బట్టి మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ 1న ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి కల్కి చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.
Also Read: Congress 6 Guarantees : సాధ్యం కానీ ఆరు గ్యారెంటీలు అంటూ తలసాని సెటైర్లు
Related News
Rukshar Dhillon : రుక్సర్ మెరుపులు చూశారా.. స్టార్ హీరోయిన్ కటౌట్ కానీ..?
Rukshar Dhillon వెండితెర మీద అందరికి లక్ కలిసి రావడం జరగదు. కొందరికి ఫస్ట్ సినిమాతోనే లక్ తోడైతే.. మరికొందరికి కొన్ని సినిమాలు చేసి టాలెంట్ చూపిస్తే కానీ అవకాశాలు రావు.