Suhas Prasanna Vadanam : సుహాస్ సినిమాకు బడా బ్యానర్స్ సపోర్ట్..!
Suhas Prasanna Vadanam చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంటున్న యువ హీరో సుహాస్ రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో సూపర్ సక్సెస్ అందుకోగా లేటెస్ట్ గా
- Author : Ramesh
Date : 25-04-2024 - 6:51 IST
Published By : Hashtagu Telugu Desk
Suhas Prasanna Vadanam చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంటున్న యువ హీరో సుహాస్ రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో సూపర్ సక్సెస్ అందుకోగా లేటెస్ట్ గా మరో సినిమాతో వస్తున్నాడు. అయితే రీసెంట్ గా శ్రీరంగనీతులు సినిమాతో వచ్చిన సుహాస్ ఆ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం సుహాస్ నటించిన ప్రసన్నవదనం సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. మే 3న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అర్జున్ వైకె డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తోనే ఆసక్తి కలిగించేలా చేసింది.
ప్రసన్నవదనం సినిమాలో సుహాస్ తో పాటు పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ నటించారు. సినిమాలో ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా ఆసక్తికరంగా ఉండేలా ఉంది. ఈ సినిమాను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సుహాస్ సినిమాను మైత్రి వారు డిస్ట్రిబ్యూట్ చేయడంతోనే సినిమా సగం సక్సెస్ అనేస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాను కన్నడలో హోంబలె బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తెలుగు వరకు మైత్రి మేకర్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం హోంబలె బ్యానర్ పంపిణీ చేస్తుంది. దీనికోసం సుహాస్ సినిమాతో భారీ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది. ముందు షార్ట్ ఫిలింస్ తో ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన సుహాస్ లీడ్ రోల్ తో వరుస హిట్లు కొడుతున్నాడు. ప్రసన్నవదనం కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి సినిమా కూడా ఆశించిన రేంజ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Sai Durga Tej : కొత్త దర్శకుడితో మెగా మేనల్లుడు.. ఆ సినిమా పరిస్థితి ఏంటో..?