Siddharth: డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పాలసీ: బొమ్మరిల్లు సిద్దార్థ్
తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనంటున్నాడు హీరో సిద్దార్థ్.
- By Balu J Published Date - 11:17 AM, Thu - 8 June 23
హీరో సిద్దార్థ్ అనగానే చాలామందికి గుర్తుకురాకపోవచ్చు. కానీ బొమ్మరిల్లు అనగానే వెంటనే లవర్ బాయ్ సిద్దార్థ్ గుర్తుకువస్తారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు ఆయన. తాజాగా టక్కర్ సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనంటున్నాడు. డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటామనే కాన్సెప్ట్ కు తాను వ్యతిరేకం అని చెబుతున్నాడు.
చిన్న చిన్న విషయాల్లో కూడా తను ఆనందం వెదుక్కుంటానని అంటున్నాడు. “ఈ తరంలో డబ్బు సంపాదించాలనే ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. సెలబ్రిటీల విపరీత సంపాదన అందరికీ తెలిసిందే. అయితే, నేను పెరిగిన విధానం వేరు. డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పాలసీ. మ్యూజిక్ తో పాటు, చిన్న చిన్న విషయాల్లో నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో కేవలం 2వేలు మాత్రమే ఇచ్చేవారు.
అందులోంచి పెట్రోల్ కు 160 రూపాయలు అయిపోయేవి. అయినా అప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను. నేను సాధారణ విషయాల్లో ఆనందం, సంతృప్తి పొందుతాను. కోరుకున్నప్పుడల్లా ప్రశాంతంగా నిద్రపోతాను. కాలేజీ రోజుల్లో నాటి పాత దుస్తులనే ఇప్పటికీ ధరిస్తున్నాను.”ఇలా తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వననే విషయాన్ని బయటపెట్టాడు సిద్దార్థ్. ఎప్పటికీ గుర్తిండిపోయే చిత్రాన్ని రూపొందించాలనేది తన కల అని.. అదే తన డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిపాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుకు ‘చిన్నా’ అనే టైటిల్ పెట్టాడు. దీంట్లో నటించడంతో పాటు, స్వయంగా తనే నిర్మిస్తాడట. ఆ సినిమాతో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు సిద్దార్థ్. ఈ హీరో నటించిన టక్కర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.
Also Read: Jr NTR : నిర్మాతగా మారనున్న ఎన్టీఆర్? ఆ హీరోతో సినిమా..
Related News
Vishwak Sen: ‘సిట్’ మూవీ ట్రైలర్ విడుదల చేసి అభినందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్
Vishwak Sen: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ‘SIT'(సిట్ – స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. VBR (విజయ్ భాస్కర్ రెడ్డ�