Kalki : కల్కి టీం ఫై పీఠాధీశ్వరుడు ఆగ్రహం
ఈ చిత్రంలో కల్కి భగవానుడి గురించిన ప్రాథమిక భావనను మార్చారని, హిందూ గ్రంధాలలో వ్రాసిన మరియు వివరించిన దానికి విరుద్ధంగా ఉందని, భగవాన్ కల్కి కథ యొక్క చిత్రణ మరియు వర్ణన పూర్తిగా సరికానిది
- By Sudheer Published Date - 03:43 PM, Mon - 22 July 24

కల్కి (Kalki 2898 AD) టీం ఫై ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్రీ ‘కల్కి ధామ్’ లోని కల్కి పీఠాధీశ్వరుడు (Kalki Dham Peethadheeshwar) ఆచార్య ప్రమోద్ కృష్ణం (Acharya Pramod Krishnam) లీగల్ నోటీసులు జారీ చేసారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ ఇలా ఎంతో మంది ఈ మూవీ లో నటించి మెప్పించగా రాజమౌళి , సల్మాన్ దుల్కర్ , విజయ్ దేవరకొండ , వర్మ వంటి వారు ప్రత్యేక పాత్రలో కనిపించేసరికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. వరల్డ్ వైడ్ గా రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా అంటే ఇదేరా అని అంత మాట్లాడుకునేలా చేసింది. ప్రస్తుతం చాల చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఫై కీలక ఆరోపణలు చేసారు కల్కి పీఠాధీశ్వరుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం.
We’re now on WhatsApp. Click to Join.
కల్కి సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, పవిత్ర గ్రంథాలలో వివరించిన విధంగా కాకుండా, దేవతల ప్రాతినిధ్యాన్ని, అలాగే పురాణ పురుషుల పాత్రలను ఈ చిత్ర యూనిట్ వక్రీకరించిందని ఆయన వాదించాడు. అలాగే ఈ చిత్రంలో కల్కి భగవానుడి గురించిన ప్రాథమిక భావనను మార్చారని, హిందూ గ్రంధాలలో వ్రాసిన మరియు వివరించిన దానికి విరుద్ధంగా ఉందని, భగవాన్ కల్కి కథ యొక్క చిత్రణ మరియు వర్ణన పూర్తిగా సరికానిది, మరియు కోట్లాది మంది హిందువులు మరియు కల్కి అనుచరుల మత విశ్వాసాలకు కేంద్రంగా ఉన్న పవిత్ర గ్రంథాలను చిత్ర యూనిట్ అవమానిస్తుంది అని ఆచార్య ప్రమోద్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కల్కి చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేస్తూ, ఈ చిత్ర నిర్మాతలు మరో 15 రోజుల్లోగా తమ ఆరోపణల గురించి సంజాయిషి ఇవ్వాలని, సినిమాలో చేసిన తప్పులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే వారిపై సివిల్ మరియు క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also : Krishna Vamsy : సీక్వెల్స్ నచ్చవు.. కృష్ణవంశీ ఇలా అనేశాడేంటి..?