Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అతనితో ప్రేమలో పడిందా..?
Mrunal Thakur బాలీవుడ్ లో ఆల్రెడీ సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కు తెలుగులో ఒక ఆఫర్ రాగానే సంతోషంగా చేసింది. అయితే అది ఆమె కెరీర్ ని మలుపు తిప్పుతుందని
- By Ramesh Published Date - 01:12 PM, Wed - 15 May 24

Mrunal Thakur బాలీవుడ్ లో ఆల్రెడీ సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కు తెలుగులో ఒక ఆఫర్ రాగానే సంతోషంగా చేసింది. అయితే అది ఆమె కెరీర్ ని మలుపు తిప్పుతుందని మాత్రం అనుకోలేదు. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా హిట్ లో ప్రధాన కారణమైన ఆమెకు సూపర్ ఐడెంటిటీ వచ్చింది. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ నానితో హాయ్ నాన్న సినిమా చేసింది. నాని తో చేసిన సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో అమ్మడు మరింత లక్కీ హ్యాండ్ గా మారింది.
ఇక థర్డ్ మూవీగా ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సినిమా ఫ్లాప్ అయినా ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ మాత్రం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తన నాల్గో సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. ఇదిలాఉంటే సడెన్ గా మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందని వార్తలు మొదలయ్యాయి. నటుడు సిద్ధాంత్ తో అమ్మడు డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
రీసెంట్ గా సిద్ధాంత్, మృణాల్ ఇద్దరు క్లోజ్ గా కనిపించారు. ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఇద్దరు హంగ్ చేసుకున్నారు. ఒకరిని ఒకరు చేతులు పట్టుకుని కనిపించారు. అది చూసిన ముంబై మీడియా మృణాల్ డేటింగ్ న్యూస్ కన్ ఫర్మ్ చేస్తున్నారు. సాధారణంగా స్టార్ రేంజ్ కి వచ్చిన ప్రతి హీరోయిన్ ని ఎవరితోనో ఒకరితో లింక్ పెడుతుంటారు. అయితే కొన్ని కేవలం వార్తల వరకే పరిమితం కాగా మరికొందరు వాటిని నిజం చేశారు. అయితే మృణాల్ నిజంగానే సిద్ధాంత్ తో ప్రేమలో ఉందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.
అయితే సిద్ధాంత్ అంతకుముందు బిగ్ బీ అమితాబచ్చన్ మనవరాలు నవ్య నవేలితో రిఒలేషన్ షిప్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. మరి ఆమెను వదిలేసి మృణాల్ తో సిద్ధాంత్ రిలేషన్ మొదలు పెట్టాడా ఏంటని మీడియా హడావిడి చేస్తుంది.