Rana Naidu: బాబాయ్, అబ్బాయ్ లు గట్టి ప్లాన్ తోనే వస్తున్నారు!
దగ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రానా నాయుడు (Rana Naidu) ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- Author : Gopichand
Date : 16-02-2023 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
దగ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రానా నాయుడు (Rana Naidu) ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హైదరాబాద్ నుంచి తెలుగు మీడియాని ఆహ్వానించి మరీ తమ ప్రత్యేకత చూపుకుంది నిర్మాణ బృందం. ఒక పెద్ద సినిమాకయ్యేంత ఖర్చు దీనికి పెట్టారని టీజర్ నుంచే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. వెంకటేష్ రానాల తొలి ఫుల్ లెన్త్ కలయిక కావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. దానికి తగ్గట్టే వీడియోని కట్ చేశారు.
Also Read: Smitha Beats Balakrishna: బాలయ్యను బీట్ చేస్తున్న స్మిత.. ‘నిజం విత్ స్మిత’ షో కు ఫుల్ క్రేజ్
సినీ పరిశ్రమలోనే కాదు ఏ సెలబ్రిటీకి ఎలాంటి సమస్య వచ్చినా అందరికీ గుర్తొచ్చే పేరు రానా(రానా). తనను నమ్మి కాంట్రాక్టు ఇచ్చిన వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా సరే చేసేందుకు సిద్ధపడతాడు. ఈ క్రమంలో నేరాలతో నిండి ఉన్న చీకటి ప్రపంచంలో పెద్ద గుర్తింపు తెచ్చుకుంటాడు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవించిన నాగా(వెంకటేష్) బయటికి వస్తాడు. అతనెవరో కాదు స్వయానా రానా తండ్రి. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. విపరీతమైన ద్వేషంతో రగిలిపోయే రానా ఏం చేశాడనేది అసలు స్టోరీ.