Smitha Beats Balakrishna: బాలయ్యను బీట్ చేస్తున్న స్మిత.. ‘నిజం విత్ స్మిత’ షో కు ఫుల్ క్రేజ్
(Unstoppable) షో దూసుకుపోతున్న సమయంలో సరిగ్గా.. సెలబ్రిటీ టాక్ షోగా `నిజం విత్ స్మిత` ఓటీటీలో ప్రారంభమైంది.
- By Balu J Published Date - 05:28 PM, Wed - 15 February 23
నందమూరి హీరో బాలయ్య (Balakrishna) `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` అంటూ సెలబ్రిటీస్ టాక్ షోని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. సీజన్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో ఇటీవలే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లతో సీజన్ 2 ని మొదలు పెట్టడం.. ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల ఎపిసోడ్ లతో సీజన్ 2 కూడా బ్లాక్ బస్టర్ షోగా పాపులర్ అయ్యింది. అయితే అన్ స్టాపబుల్ (Unstoppable) షో దూసుకుపోతున్న సమయంలో సరిగ్గా.. సెలబ్రిటీ టాక్ షోగా `నిజం విత్ స్మిత`(Smitha) పేరుతో ఓటీటీలో ప్రారంభమైంది. దీనికి సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తో తొలి ఎపిసోడ్ ని మొదలు పెట్టింది. చిరంజీవి ఎపిసోడ్ వైరల్ కావడంతో స్మిత షో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలయ్య అన్ స్టాపబుల్ షో తరహాలోనే సరికొత్తగా సాగుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ షోలో పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట (Social media) వైరల్ గా మారి సందడి చేస్తోంది. ఈ తాజా ఎపిసోడ్ ఫిబ్రవరి 17న సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. స్మిత ఇటు చంద్రబాబును, అటు చిరంజీవిని ఇంటర్వ్యూ చేసి అందన్నీ ఆకట్టుకుంది. అయితే అన్ స్టాబబుల్ లో అడగని విషయాలను స్మిత (Smita) అడగడంతో ఈ షో చాలా క్రేజ్ గా మారింది. ఫ్యాన్స్ కూడా ఈ స్మిత ప్రోమోలను చూస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడిపై పలు ఆసక్తికర ప్రశ్నలని సంధించినట్టుగా తెలుస్తోంది.
షోలోకి సాదరంగా ఆహ్వానించిన స్మిత మీ చిన్నతనంలో లవ్ స్టోరీస్ గురించి మాతో షేర్ చేసుకుంటారా అని అడిగింది. ఆ ప్రశ్నకు చిరునవ్వులు చిందిస్తూ `చాలా రీసెర్చ్ చేశారమ్మా` అన్నారు.. ఎప్పుడూ రాయలసీమ మాత్రం వెనకబడిపోయి వుంటోందని అంటారు అని అడిగితే ..దానికి నాయకులే కారణమన్నారు. ఆ తర్వాత చిరంజీవితో కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించేలా చేశారు. పవన్ కళ్యాణ్ కు పాలిటిక్స్, సినిమాలు.. రెండింట్లో ఏదీ బెస్ట్ అంటూ చిరుతోనే సమాధానం చెప్పించింది. క్రష్ లు, ఇండస్ట్రీ పై అధిపత్యం, విజయాలు ఇలా ఎన్నో అంశాలను చిరు నుంచి తెలివిగా రాబట్టింది స్మిత (Smita). అయితే అన్ స్టాపబుల్ షోకు హాజరుకాని చిరంజీవి స్మిత్ షో (Smitha show)లో కనిపించడంతో మరింత ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటివరకు బుల్లితెరపై అన్ స్టాపబుల్ జట్ స్పీడుతో దూసుకుపోతున్న క్రమంతో పాప్ సింగర్ నిజం విత్ స్మిత అంటూ మెరుపులా మెరిసింది. తన మాటలు, యాంకరింగ్ తో షో కు మరింత వెన్న తీసుకొచ్చింది. మొత్తానికి అన్ స్టాపబుల్ తో దూసుకుపోతున్న బాలయ్య కు స్మిత బ్రేక్ వేసినట్టయింది.
Also Read: Singer Sunitha: నేను ప్రెగ్నెంటా.. నాకే తెలియదు : రూమర్స్ పై సునీత రియాక్షన్!
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�