HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Monalisa New Controversy Director Producer Dispute

Monalisa : పరేషాన్‌లో పూసలమ్మాయి సినీ కెరీర్‌..!

Monalisa : సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయి, సినిమా అవకాశాన్ని పొందిన మోనాలిసా ప్రస్తుతం కొత్త వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు సనోజ్ మిశ్రా , నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఆమె మొదటి సినిమా ప్రాజెక్టుకు ఊహించని అవాంతరాలు ఎదురవుతున్నాయి.

  • By Kavya Krishna Published Date - 10:39 AM, Thu - 20 February 25
  • daily-hunt
Monalisa
Monalisa

Monalisa : సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా పాపులర్‌ అవ్వడమే కాదు, సినిమా ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుపోయింది. దర్శకుడు సనోజ్ మిశ్రా, నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఆమె మొదటి సినిమా ప్రాజెక్టు ఆగిపోతుందో అనే ఆందోళనతో మోనాలిసా ఉన్నట్టుగా తెలుస్తోంది.

కథలోకి వెళితే, మోనాలిసా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి. ఆమె కుంభమేళాలో పూసలు అమ్మే చిన్న వ్యాపారం చేస్తూ, ఒక నెటిజన్‌ ఆమె ఫోటో తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ఆమె అందం, చిరునవ్వుతో కనిపించడం నెటిజన్లను ఆకర్షించింది, దీంతో ఆ ఫోటో వైరల్‌ అయింది. ఆమెను చూసేందుకు కుంభమేళాకు వచ్చిన జనాలు ఆసక్తి చూపారు. కొన్ని సందర్భాల్లో ఆమెను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొన్న మోనాలిసా తన వ్యాపారాన్ని ఆపి స్వగ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆమెకు జరిగిన అన్యాయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు.

 HCA President: ఐపీఎల్‌కు హైదరాబాద్ సిద్ధం.. ప‌లు విష‌యాలు పంచుకున్న హెచ్‌సీఏ అధ్య‌క్షుడు!

ఈ సమయంలో బాలీవుడ్‌ డైరెక్టర్‌ సనోజ్ మిశ్రా మోనాలిసా ఫోటోలు చూసి, ఆమెకు తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించారు. మోనాలిసా కూడా సంతోషంగా మణిపూర్ నేపథ్యంతో రూపొందనున్న సినిమాలో నటించేందుకు సంతకం చేసింది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఆమె యాక్టింగ్‌ శిక్షణ తీసుకుంటోంది.

అయితే, ఈ క్రమంలో డైరెక్టర్‌ సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉండటం, ఆమె విషయాలను దగ్గరగా చూడటం పై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సనోజ్ మిశ్రా మీద తీవ్ర ఆరోపణలు చేసారు, “మోనాలిసాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు, ఆమెను ట్రాప్ చేస్తున్నాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనిపై సనోజ్ మిశ్రా తన వివరణలో, “మోనాలిసా నా కూతురి వయసు ఉంటుందని, ఆమెను తాను వేధించడం లేదు. ఆమె ఈ సినిమాను ఇష్టపూర్వకంగా చేస్తోంది. ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆమెకు శిక్షణ ఇస్తున్నాను” అని క్లారిఫై చేశారు. అయినప్పటికీ, ఈ వివాదం మరింత ముదిరిపోయింది. నిర్మాత జితేంద్ర నారాయణ్ మరోసారి సనోజ్ మిశ్రా పై తీవ్ర విమర్శలు చేశారు. “డైరెక్టర్‌ పబ్లిసిటీ కోసం మోనాలిసాను వాడుకుంటున్నాడు” అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వివాదం కారణంగా మోనాలిసా మొదటి సినిమా ప్రాజెక్టుపై తీవ్రమైన ఆందోళనకు గురైంది.

 Telangana Premier League : తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహకారం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actress
  • bollywood
  • controversy
  • Director sanoj mishra
  • Dispute
  • Kumbh Mela
  • Monalisa
  • Movie Opportunity
  • Producer Jitendra Narayan Singh
  • Publicity
  • Social Media Fame

Related News

Controversy in AP Endowment Department.. The stage is set for the dismissal of the Assistant Commissioner!

AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!

గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ కె. శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుకు ఆమె ఇటీవలే సమాధానమిచ్చారు. అయితే, ఆమె సమర్పించిన వివరణలు శాఖను తృప్తిపరచలేకపోయాయని సమాచారం.

  • Ar Rahman

    AR Rahman : మార్వెల్ సినిమాలు కూడా పాప్కార్న్‌తో ఎంజాయ్ చేస్తాం

Latest News

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

  • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

  • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

  • YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd