Minister Kandula Durgesh : మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన మంత్రి కందుల దుర్గేష్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారని
- By Sudheer Published Date - 01:53 PM, Thu - 20 June 24

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh).. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని ‘విశ్వంభర’ సెట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. జనసేన నుండి నిడదవోలు ఎమ్మెల్యే గా భారీ విజయం సాధించిన కందుల దుర్గేష్..నేడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ సందర్బంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ని మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.
చిరంజీవి , త్రిష జంటగా బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీ తెరకెక్కుతుంది. హై వీఎఫ్ఎక్స్, సోసియో ఫ్యాంటసీ జానర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర సెట్ కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెళ్లి మర్యాద పూర్వకంగా చిరంజీవి ని కలిశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భాంగా చిరంజీవి ఆయనకు స్వాగతం పలికారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారని, ఆయన చూపిన సానుకూలతకు ధన్యవాదాలు తెలిజేశారు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు కందుల దుర్గేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!💐💐… pic.twitter.com/R7tDsrPR6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2024
Read Also : Reels : ప్రాణాలు పోతున్నా మీరు మారారా..?