Megha Akash : ఘనంగా హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి..
ఇటీవల ఆగస్టులో మేఘ ఆకాష్ తమిళనాడులోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విష్ణు అనే అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుంది.
- By News Desk Published Date - 03:37 PM, Sun - 15 September 24

Megha Akash : తెలుగులో ‘లై’ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైంది తమిళ భామ మేఘ ఆకాష్. ఆ తర్వాత తెలుగులో చల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. మేఘ ఆకాష్ ప్రస్తుతం వరుసగా తమిళ్, తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆగస్టులో మేఘ ఆకాష్ తమిళనాడులోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విష్ణు అనే అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుంది.
గత రెండు రోజులుగా మేఘ ఆకాష్ – విష్ణు మెహందీ, సంగీత్, రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. వీరి రిసెప్షన్ వేడుకకు సీఎం స్టాలిన్ తో పాటు, తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక మేఘ ఆకాష్ – విష్ణు పెళ్లి నేడు ఉదయం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చెన్నైలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం మేఘ ఆకాష్ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వగా అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Joined hands together @meghaakash and @saaivishnu ❤️ Wishing a Happy life together ✨️😍
.#HappyMarriedLife #MeghaAkash #SaaiVishnu #BlacksheepCinemas pic.twitter.com/4gRbiiE4Ip— Blacksheep Cinemas (@bscinemas) September 15, 2024
Also Read : Devara Ticket Price Hike : ‘దేవర’ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు