Peddi : ‘పెద్ది’ పై మెగాస్టార్ రియాక్షన్
Peddi : "మై డియర్ చరణ్ హ్యాపీ బర్త్ డే. 'పెద్ది' లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. నువ్వు నటుడిగా మరో కొత్త కోణాన్ని అన్వేషిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది అభిమానులకు నిజమైన కన్నుల పండుగ అవుతుందని నమ్ముతున్నా"
- By Sudheer Published Date - 05:11 PM, Thu - 27 March 25

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (Ram Charan Birthday) కానుకగా ఆయన కొత్త సినిమా RC16 టైటిల్‌ను ‘పెద్ది’(Peddi)గా ప్రకటించడంతో పాటు, ఫస్ట్ లుక్ (Peddi First Look) పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ (Ram Charan) గుబురు గడ్డంతో, మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. పోస్టర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఇది వైరల్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ సినిమా గురించి అంచనాలు పెరిగిపోయాయి.
Liver: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తాగాల్సిందే?
ఈ పోస్టర్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన కుమారుడు రామ్ చరణ్ లుక్ ఎంతో ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తోందని ప్రశంసించారు. “మై డియర్ చరణ్ హ్యాపీ బర్త్ డే. ‘పెద్ది’ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. నువ్వు నటుడిగా మరో కొత్త కోణాన్ని అన్వేషిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది అభిమానులకు నిజమైన కన్నుల పండుగ అవుతుందని నమ్ముతున్నా” అని చిరు పేర్కొన్నారు. మెగాస్టార్ మాటలు వినగానే మెగా ఫ్యాన్స్ ఆనందం అవధులు లేకుండా పోయింది.
Excise Police Stations: 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియర్!
రామ్ చరణ్ కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా ‘పెద్ది’ నిలవబోతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. చిత్ర కథ, కొత్త తరహా గెటప్‌లో రామ్ చరణ్ కనిపిస్తుండటంతో అభిమానులు సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. చిరంజీవి కూడా తన అండదండలు తెలియజేయడంతో ‘పెద్ది’పై మరింత హైప్ పెరిగింది. ఇకపోతే ఈ చిత్రానికి జాతీయ స్థాయి దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Happy Birthday
My dear @AlwaysRamCharan !💐💐 Many Many Happy Returns!! 🤗 #Peddi looks very intense and I am sure it will bring out a new dimension of the Actor in you and will be a feast for Cinema lovers and Fans!! Bring it on!!! 😍— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025