Megastar Tweet: డియర్ నాని ‘దసరా’ సినిమా చాలా బాగుంది!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్విటర్ వేదికగా దసరా సినిమాపై ప్రశంసలు కురిపించారు.
- Author : Balu J
Date : 13-04-2023 - 3:36 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని (Nani), కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దసరా’ (Dasara) మార్చి 30న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘డియర్ నాని ‘దసరా’ సినిమా చాలా బాగుంది. నీ నటనతో అందర్నీ మెప్పించావు. మహానటి కీర్తి సురేశ్ నటన అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమా అంటే నమ్మశక్యంగా లేదు. దీక్షిత్ తనదైన తీరులో నటించారు. మీ అందరికీ నా అభినందనలు’ అంటూ రాసుకొచ్చారు.
నాని కెరీర్‌లోనే హైయ్యెస్ట్ వసూళ్లు
ఇక 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా (World Wide) ఈ సినిమా వసూళ్ల విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ): రూ. 24.98కోట్లు.. సీడెడ్ (రాయలసీమ): రూ. 5.20 కోట్లు.. ఉత్తరాంధ్ర: రూ. 4.35 కోట్లు.. ఈస్ట్: రూ. 2.19 కోట్లు.. వెస్ట్: రూ. 1.23 కోట్లు.. గుంటూరు: రూ. 2.39 కోట్లు.. కృష్ణా: రూ. 2.06 కోట్టు.. నెల్లూరు: రూ. 0.91 కోట్లు.. తెలంగాణ:+ ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 43.31 కోట్లు కర్ణాటక: + రెస్టాఫ్ భారత్ రూ. 4.62 కోట్లు.. నార్త్ భారత్‌లో .. రూ. 1.52కోట్లు.. ఓవర్సీస్ : రూ. 10.42కోట్లు.. వరల్డ్ వైడ్ గా రూ. 61.82 కోట్లు (రూ. 111.05కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి నాని కెరీర్‌లోనే హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
పారితోషికం పెంచేసిన నేచరల్ స్టార్
నిజానికి దసరా సినిమాకు ముందే నాని తన పారితోషికాన్ని (Salary) కాస్త పెంచేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు తన రెమ్యునరేషన్ మరో 20% నాని పెంచేశాడట. ఇప్పటికే రెమ్యునరేషన్‌లో రూ.20 కోట్ల క్లబ్‌లో నాని ఉన్నాడు. ప్రస్తుతం ఈ గ్రాఫ్ ఇంకా పెరిగిందన్నమాట. అయితే నాని కంటే ఎక్కువ తీసుకునే హీరోలు టాలీవుడ్‌లో ఉన్నారు.
Kudos to the entire team of ‘DASARA’🥰@NameisNani @odela_srikanth @KeerthyOfficial @Dheekshiths
@Music_Santosh pic.twitter.com/CciJqkcwrv— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2023
Also Read: EXCLUSIVE: ఆసక్తి రేపుతున్న రాజమౌళి-మహేశ్ కాంబో.. హనుమాన్ స్ఫూర్తితో మహేశ్ క్యారెక్టర్!