EXCLUSIVE: ఆసక్తి రేపుతున్న రాజమౌళి-మహేశ్ కాంబో.. హనుమాన్ స్ఫూర్తితో మహేశ్ క్యారెక్టర్!
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ (Mahesh Babu) తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 01:11 PM, Thu - 13 April 23
మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి 2, RRR లాంటి సినిమాలతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గ్లోబల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో రాజమౌళి ముందువరుసలో ఉన్నారని చెప్పక తప్పదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెరక్కెక్కముందే ఎన్నో భారీ అంచనాలను రేపుతోంది. డీప్ ఫారెస్ట్ అటవీ నేపథ్యంలో మహేష్ బాబు సినిమా ఉంటుందనీ, ఈ ఏడాది చివరిలో సినిమా సెట్స్ పై కి వెళ్తుందని మేకర్స్ భావిన్నారు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్రిప్ట్ పనులు వేగంగా జరుతున్నాయని, ఇండియన్ బాక్సాఫీస్ (Indian Boxoffice) మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటిగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం తో మహేష్ బాబు పాన్ ఇండియా కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ ఎపిక్ జంగిల్ (Forest) అడ్వెంచర్ ఆధారంగా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. SS రాజమౌళి తదుపరి చిత్రంలో మహేష్ బాబు పాత్ర హనుమంతుని నుండి ప్రేరణ పొందింది. “ఎస్ఎస్ రాజమౌళి రామాయణం (Ramayan), మహాభారతాలను స్ఫూర్తిగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఆయన భారతీయ సంస్కృతిలో పాతుకుపోయిన సినిమాలు చేస్తాడు. చిత్రం ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ అయితే, మహేష్ బాబు పాత్రలో లార్డ్ హనుమంతుని (Hanuman) పోలి ఉంటుంది. నిజానికి పాత్ర తీరు కూడా రామాయణానికి దగ్గరగా ఉంటుందని టాక్.
SS రాజమౌళి ఇతిహాసాల గురించి చదువుతూ పెరిగాడు. RRRలో కూడా Jr. NTR. రామ్ చరణ్‌ల కోసం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రతో ఇండియన్ వ్యాల్యూస్ చూపించాడు. మహేశ్, రాజమౌళి మూవీ ఈ ఏడాది సెట్స్‌పైకి తీసుకురావాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతీయ సినిమాలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా, అమెజాన్ (Amazon) ఫారెస్ట్‌లో విస్తృతంగా షూటింగ్ జరుపుకోబోతుందని”అని సమాచారం.
Also Read: Ram Charan Pet: చరణ్ పెంపుడు కుక్క ‘రైమ్’ ధర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�