Chiranjeevi : మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కి రెడీ.. థియేటర్స్ లో మోత ఖాయం..
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన శంకర్ దాదా MBBS(Shankar Dada MBBS) సినిమా రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.
- Author : News Desk
Date : 15-10-2023 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల రీ రిలీజ్(Re Release) ల హవా బాగా పెరిగిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన రీ రిలీజ్ ల హడావిడి వరుసపెట్టి అందరు హీరోల సినిమాలు, ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ లకు థియేటర్స్ లో మంచి స్పందన వస్తుండటంతో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన శంకర్ దాదా MBBS(Shankar Dada MBBS) సినిమా రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. అప్పట్లో ఈ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2004 లో జయంత్ C ఫరంజి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్ గా, శ్రీకాంత్, పరేష్ రావెల్ ముఖ్య పాత్రల్లో వచ్చిన శంకర్ దాదా MBBS సినిమా కామెడీతో, పాటలతో, ఎమోషన్ తో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పెద్ద హిట్ అయింది.
ఇప్పటికి ఈ సినిమాలో కామెడీ, సాంగ్స్ బాగా పాపులర్. ఇప్పుడు శంకర్ దాదా MBBS సినిమాని నవంబర్ 4న రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో మెగాఫ్యాన్స్ ఆ రోజు థియేటర్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు.
Mega Massive Update 💥
Megastar @KChiruTweets Garu's sensational hit #ShankarDadaMBBS Re-Releasing On Nov 4th
Re-release worldwide from #megaproductions#Srikanth @iamsonalibendre #PareshRawal#Sharwanand #PanjaVaishanvTej#JayanthCParanjee#AkkineniRaviShankarPrasad… pic.twitter.com/bwmSshtV7Y
— Sai Satish (@PROSaiSatish) October 15, 2023
Also Read : Vijay : విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. అవన్నీ క్యాన్సిల్..