Megastar Chiranjeevi : చిరంజీవి వేసిన బాటలోనే వారంతా – అల్లు అరవింద్
పవన్‌కల్యాణ్ నుంచి అల్లు శిరీష్ వరకూ.. అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకున్నారు
- By Sudheer Published Date - 01:40 PM, Sat - 23 March 24

సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ (South india Film Festival) వేడుకను శుక్రవారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ప్రముఖ నిర్మాణసంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ సంస్థలు సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు. రీసెంట్ గా పద్మవిభూషణ్ పురస్కారం పొందిన ఆయన్ను వేదికపై అల్లు అరవింద్, మురళీమోహన్, టీజీ విశ్వప్రసాద్ సత్కరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తమ కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు బాట వేసింది చిరంజీవిని అని తెలిపారు. ‘పవన్‌కల్యాణ్ నుంచి అల్లు శిరీష్ వరకూ.. అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకున్నారు. అంత పెద్ద రహదారి వేశారాయన” అని అన్నారు. ఎంతో మంది యువ నటీనటులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. అలాగే చిరంజీవి పడిన కష్టాలు , ఎదిగిన తీరు, అవార్డ్స్ వంటి వాటి గురించి అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, కె.ఎస్.రామారావు, మంచు లక్ష్మీ, టీజీ వెంకటేశ్‌తోపాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Read Also : Kavitha ED Custody : ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడగింపు