Varun Tej Marriage: పెళ్లికి సిద్దమవుతున్న ‘మెగా’ హీరో.. పెళ్లి కూతురు ఎవరో మరి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి కొడుకు కాబోతున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు.
- Author : Balu J
Date : 01-02-2023 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ (Tollywood) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి కొడుకు కాబోతున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని మెగ్రా బ్రదర్ నాగబాబు కన్ఫర్మ్ చేశారు. తన మ్యారెజ్ గురించి స్వయంగా వరుణ్ (Varun Tej) ప్రకటిస్తాడని చెప్పుకొచ్చారు నాగబాబు. కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. పెళ్లి కూతురుకు సంబంధించిన విషయాలను ఇప్పుడే చెప్పలేనని.. అన్ని విషయాలు కేవలం వరుణ్ మాత్రమే వెల్లడిస్తారని అన్నారు.
పిల్లలను కంట్రోల్ చేయాలని నేను ఎప్పటికీ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అందుకే నేనూ-నా సతీమణి ఓచోట.. వరుణ్ విడిగా ఉంటున్నాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే అని నాగబాబు (Nagababu) తెలిపారు. అయితే పెళ్లి (Marriage) ఎప్పుడు, కాబోయే కోడలు గురించి నాగబాబు ఏ వివరాలు చెప్పలేదు కానీ.. వరుణ్ (Varun Tej) ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెనే అతడు పెళ్లాడబోతున్నాడని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి.
గతంలో హీరోయిన్ లావణ్యా త్రిపాఠీతో వరుణ్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరి ఇప్పుడు వరుణ్ చేసుకోబోయే అమ్మాయి (Bride) ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నారు.
Also Read: Budget 2023: ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్!