Matka Talk : వరుణ్ తేజ్ ‘మట్కా ‘ పబ్లిక్ టాక్..బన్నీ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారా..?
Matka Talk : ఎవరు చూడు సినిమా ఏమాత్రం బాగాలేదని , వరుణ్ తేజ్ యాక్టింగ్ లో కొత్తదనం లేదని , సినిమా బాగా స్లో గా ఉందని , మ్యూజిక్ కూడా వర్క్ అవుట్ కాలేదని అంటున్నారు
- By Sudheer Published Date - 11:02 AM, Thu - 14 November 24

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) నటించిన మట్కా మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెరీర్ మొదట్లోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న వరుణ్.. ఆ తర్వాత ఎందుకో సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ప్రస్తుతం మట్కా (Matka ) అంటూ ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి , నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించగా… జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
ఇక గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోయేసరికి మట్కా పై పెద్దగా అంచనాలు పెరగలేదు. సినిమా టాక్ బట్టి చూద్దాంలే అని మెగా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ సినిమా టాక్ చూస్తే నెగిటివ్ గా ఉంది. ఎవరు చూడు సినిమా ఏమాత్రం బాగాలేదని , వరుణ్ తేజ్ యాక్టింగ్ లో కొత్తదనం లేదని , సినిమా బాగా స్లో గా ఉందని , మ్యూజిక్ కూడా వర్క్ అవుట్ కాలేదని అంటున్నారు. కొంతమంది మాత్రం సినిమా బాగానే ఉంది..కావాలని కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని వాపోతున్నారు. దీనికి కారణం రీసెంట్ గా మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ చేసిన కామెంట్స్ వల్లే అంటున్నారు.
గతకాలంగా అల్లు అర్జున్ vs మెగా ఫ్యామిలీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరు నచ్చక మెగా ఫ్యాన్స్ ఆయన పై ఆగ్రహంతో ఉన్నారు. బన్నీ ఎక్కడ చూడు తన సొంత కాళ్లపై పైకి వచ్చానని , తన వెనుక ఎవ్వరు లేరు..తనకున్నది తన అభిమానులే అంటూ గొప్పలు చెప్పుకోవడం చేస్తున్నారు. ఇది తప్పు అని వరుణ్ ఇండైరెక్ట్ గా బన్నీ సూచించాడు.
‘మనం పెద్దోళ్లం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. సక్సెస్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా వచ్చాం.. అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృథానే’ అని వరుణ్ కామెంట్స్ చేసాడు ఈ కామెంట్స్ ఖచ్చితంగా అల్లు అర్జున్ పైనే అని ఎవరడిగిన చెపుతారు. ఈ కామెంట్స్ బన్నీ ఫ్యాన్స్ లో ఆగ్రహం నింపాయి. అందుకే వరుణ్ నటించిన మట్కా కు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ బన్నీ నటించిన పుష్ప 2 ఉంది..అది చూసుకోండి అంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మరి నిజంగా మట్కా బాగుందా..లేదా అనేది పూర్తి రివ్యూస్ పడితే కానీ చెప్పలేం.
Read Also : Mobile Phone Habits : ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ వైపు చూస్తున్నారా? ఈ ప్రమాదం తప్పు కాదు