EAGLE Trailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ చూశారా? ఈ సారి భారీ రేంజ్‌లో విధ్వంసం..
తాజాగా ఈగల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
- Author : News Desk
Date : 20-12-2023 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
మాస్ మహారాజ రవితేజ)(Raviteja) సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే దసరాకి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వచ్చాడు. ఈ సినిమా మెప్పించిన కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. త్వరలో సంక్రాంతికి(Sankranthi) ఈగల్(Eagle) సినిమాతో రాబోతున్నాడు రవితేజ.
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి ఈగల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రవితేజ ఫుల్ జుట్టు, గడ్డంతో మాస్ గా, మరో వైపు లవర్ బాయ్ గా రెండు రకాలుగా కనిపించనున్నాడు.
ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈగల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఫుల్ మాస్, యాక్షన్ తో సాగింది. ఫారిన్ లో ఆయుధాల డీలింగ్, ఒక ఊరి కథ, ప్రేమ కథ.. ఇలా సినిమా కథని అర్ధం కాకుండా ట్రైలర్ ని బాగా కట్ చేశారు. ‘ఆయుధాలతో యుద్ధం చేసేవాడు రాక్షసుడు అవుతాడు. ఆయుధాలతో యుద్ధం ఆపేవాడు దేవుడు అవుతాడు’ అని రవితేజ చెప్పే మాస్ డైలాగ్ వైరల్ గా మారింది. ట్రైలర్ లో భారీ విధ్వంసం కనిపించింది. మరి ఈగల్ సినిమాతో అయినా రవితేజ మళ్ళీ హిట్ కొడతాడా చూడాలి. జనవరి 13న సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. గజ్వేల్‌లో అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్‌కి తరలింపు..