Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. గజ్వేల్‌లో అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్‌కి తరలింపు..
నిన్న రాత్రి నుంచి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఇవాళ ఉదయం నేనెక్కడికి పోలేదు అని వీడియో రిలీజ్ చేశాడు.
- Author : News Desk
Date : 20-12-2023 - 7:58 IST
Published By : Hashtagu Telugu Desk
బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7)లో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ని విన్నర్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అతని మనుషులు ఆదివారం రాత్రి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వేరే కంటెస్టెంట్స్, వారి కార్లపై దాడి చేసి, కార్ అద్దాలు పగలకొట్టారు. ఈ ఘటనలో గవర్నమెంట్ బస్ అద్దాలు కూడా పగలకొట్టారు.
అంతేకాకుండా పోలీసులు ప్రశాంత్ ని సైలెంట్ గా వెళ్లిపొమ్మన్నా వినకుండా పోలీసులతో గొడవ పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళాడు. దీంతో ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి నానా హంగామా చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసినందుకు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ పై కూడా పోలీసులు(Police) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ ఘటనలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ని A-1 గా, అతని తమ్ముడు మనోహర్ A-2 గా, మరో స్నేహితుడు A-3 గా ఉండటంతో నిన్న రాత్రి నుంచి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఇవాళ ఉదయం నేనెక్కడికి పోలేదు అని వీడియో రిలీజ్ చేశాడు. దీంతో పోలీసులు ఇవాళ సాయంత్రం గజ్వేల్ మండలం లోని కొల్గూర్ గ్రామంలోని అతని ఇంటి వద్దే ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రశాంత్ ని జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. మరి ఈ కేసు ఇంకెంత ముందుకి వెళ్తుందో చూడాలి. మరింతమంది నిందితులను కూడా సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read : Pallavi Prashanth: నేనెక్కడికి పోలేదు.. ఇంటికాడే ఉన్నా: పల్లవి ప్రశాంత్