Manmathudu Anshu : అన్షు సినిమాలు ఆపేయడానికి కారణం అదేనా..? ఇన్నేళ్లలకు బయటపడ్డ నిజం..!
Manmathudu Anshu మన్మథుడు, రాఘవేంద్ర సినిమాల్లో నటించిన హీరోయిన్ అన్షు గుర్తుంది కద. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె యూత్ ఆడియన్స్ మనసులు దోచేసింది.
- Author : Ramesh
Date : 22-02-2024 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
Manmathudu Anshu మన్మథుడు, రాఘవేంద్ర సినిమాల్లో నటించిన హీరోయిన్ అన్షు గుర్తుంది కద. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె యూత్ ఆడియన్స్ మనసులు దోచేసింది. ఇప్పటికీ ఎక్కడ మన్మథుడు సినిమా చూసినా సరే అన్షు గురించి చర్చ జరుగుతుంది. అప్పట్లో రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన అన్షు ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆమె ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన అన్షు ఈ ఇంటర్వ్యూ ఇచ్చి అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఇంగ్లాండ్ లోనే పుట్టి పెరిగిన అన్షు పూర్వీకులు భారతీయులట. అయితే 16 ఏళ్ల వయసులో ఒకసారి ఇండియాకు వస్తే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఆ సినిమాలో నటించగానే ప్రభాస్ రాఘవేంద్ర ఛాన్స్ వచ్చిందట.
అయితే చేసిన రెండు సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్ పాత్ర చేయడం వాటిల్లోనూ ఆ పాత్ర చనిపోవడంతో ఆమెకు అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయట. అందుకే అన్షు సినిమాలకు దూరమైందట. 2003లో సచిన్ సాగర్ అనే పెళ్లాడిన అన్షు లండన్ లోనే సెటిల్ అయ్యిందట. అలా సినిమాలకు పూర్తిగా దూరమైంది అమ్మడు. అన్షు ఇప్పుడు కూడా మన్మథుడు సినిమాలో లానే ఉంది. ఆమె రెడీ అంటే ఆమెకు మంచి రోల్స్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీ అని చెప్పొచ్చు.