Prabhas : ‘కన్నప్ప’లో ప్రభాస్ శివుడి పాత్ర చేయడం లేదా.. మరో రోల్ సెలెక్ట్ చేసుకున్న డార్లింగ్..
'కన్నప్ప'లో ప్రభాస్ శివుడి పాత్ర చేయడం లేదంట. మరో రోల్ సెలెక్ట్ చేసుకొని అదే చేస్తానంటున్న ప్రభాస్..
- By News Desk Published Date - 09:26 AM, Sun - 12 May 24

Prabhas : శ్రీకాళహస్తి శివక్షేత్రం చరిత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. శివుడి మహాభక్తుడైన కన్నప్పగా మంచు విష్ణు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, నయనతార, మధుబాల, బ్రహ్మానందం వంటి స్టార్ కాస్ట్ కనిపించబోతుంది.
కాగా ఈ సినిమాలో ప్రభాస్.. శివుడి పాత్రని పోషించబోతున్నారని గతంలో వార్తలు వినిపించాయి. ఇక ఇటీవల ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టగా.. చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో పులిచర్మ ధరించి ఉన్న ప్రభాస్ కాలుని చూసి.. ప్రభాస్ శివుడి పాత్రలోనే కనిపించబోతున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ పాత్ర పై ఎటువంటి అంచనాలు వేసుకోకండి అంటూ మంచు విష్ణు ఓ వీడియోని రిలీజ్ చేసారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. “కన్నప్ప సినిమాలో చాలా గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ పాత్రలు కోసం నేను స్టార్ నటీనటులను ఎంచుకున్నాను. ఈక్రమంలోనే ఒక పాత్ర కోసం ప్రభాస్ ని సంప్రదించి తనకి కథ వినిపించాను. తాను అంతా విన్నాక.. ప్రభాస్ మరో పాత్ర చేస్తానని ఎంచుకున్నాడు. తనకి ఇష్టమైన రోల్ చేస్తే నాకు సంతోషమే. అందుకనే, ప్రభాస్ చేస్తానన్న పాత్రని మరికొంత డెవలప్ చేసి సినిమాలో చూపించబోతున్నాము. ఇక సినిమాలోని పాత్రలు అన్నిటి విషయానికి వస్తే.. ఈ నటుడు ఈ పాత్ర పోషిస్తున్నారని ఎవరు అంచనాలు వేసుకొని, ఉహించుకోకండి. ఆ పాత్రలను ఒక్కొకటిగా మేమే మీ ముందుకు తీసుకు వస్తాము. ఈ సోమవారం (మే 13) మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ని ఇవ్వబోతున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ కామెంట్స్ ప్రభాస్ శివుడి పాత్ర చేయడం లేదని తెలుస్తుంది. మరి ప్రభాస్ ఎంచుకున్న ఆ పాత్ర ఏంటో చూడాలి. అలాగే రేపు వచ్చే ఆ అప్డేట్ ఏంటో కూడా చూడాలి.