Vishnu vs Manoj : నా సినిమాకు భయపడి ‘కన్నప్ప’ను పోస్ట్‌పోన్ చేసాడు – మంచు మనోజ్
Vishnu vs Manoj : తన తాజా చిత్రం ‘భైరవం’పై వస్తున్న స్పందనతో విష్ణు భయపడ్డాడని, అందుకే అతను తన 'కన్నప్ప' సినిమాను పోస్టుపోన్ చేసుకున్నాడని మనోజ్ వ్యాఖ్యానించాడు
- By Sudheer Published Date - 02:01 PM, Wed - 9 April 25

మంచు కుటుంబం(Manchu Family)లో మళ్లీ గుడవలు మొదలయ్యాయి. ఇటీవల మంచు మనోజ్ (Manchu Manoj)తన కారు దొంగతనానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. విష్ణునే తన కారును దొంగతనం చేసాడని ఆరోపించాడు. ఈరోజు జల్పల్లి వద్ద ఉన్న మోహన్‌బాబు (Mohanbabu) ఇంటి గేటు వద్దకు వెళ్లిన మనోజ్ అక్కడ బైఠాయించి నిరసన తెలిపాడు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది ఆస్తి గొడవ కాదని, తన పెంపుడు జంతువులు మరియు వ్యక్తిగత వస్తువులు ఇంట్లో ఉన్నాయని వాటిని తీసుకోవడానికే వచ్చానని చెప్పాడు. తన కారును దొంగిలించడం, తన సెక్యూరిటీపై దాడి చేయడం అన్నీ మంచు విష్ణు (Vishnu) అనుచరుల పనేనని ఆరోపించాడు.
Mallikarjun Kharge : ఈవీఎంలలో ఆ మార్పులు చేశారు.. ఖర్గే సంచలన ఆరోపణలు
తన తాజా చిత్రం ‘భైరవం’పై వస్తున్న స్పందనతో విష్ణు భయపడ్డాడని, అందుకే అతను తన ‘కన్నప్ప’ సినిమాను పోస్టుపోన్ చేసుకున్నాడని మనోజ్ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా విష్ణు కెరీర్ కోసం గతంలో తాను లేడీ గెటప్ వేసి సినిమా చేశానని గుర్తు చేశాడు. ఇలా కుటుంబానికి మద్దతుగా ఉన్న తనను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించాడు. తనకు హైకోర్టు అనుమతులు ఉన్నప్పటికీ, ఇంట్లోకి అనుమతించకపోవడం తీవ్ర అన్యాయమని మనోజ్ అన్నారు. కోర్టు ఆదేశాలతో వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడమేంటి అని నిలదీశాడు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సమస్యను పరిష్కరించాలని కోరాడు.