‘మన శంకరవరప్రసాద్ గారు’ టాక్
విడిపోయిన భార్యా భర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది
- Author : Sudheer
Date : 12-01-2026 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరు – అనిల్ – వెంకీ – నయనతార కలయిక అనగానే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి ఆ అంచనాలను ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అందుకున్నారా లేదా అనేది టాక్ లో చూద్దాం.

Mana Shankara Vara Prasad G
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎనర్జీ మరియు కామెడీ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరు తనదైన వింటేజ్ డాన్స్ స్టెప్పులతో థియేటర్లను హోరెత్తించగా, నయనతార తన హుందాతనమైన నటనతో భార్య పాత్రలో ఒదిగిపోయింది. ఫస్టాఫ్ అంతా చిరు కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, పిల్లలతో ఎమోషనల్ సీన్లతో అలా అలా సాగిపోయింది. కానీ సెకండాఫ్‌లో వెంకీ రాకతో థియేటర్లు దద్దరిల్లాయి. వెంకీ గౌడ పాత్రలో వెంకీ కనిపించిన తీరు, పండించిన కామెడీ.. ముఖ్యంగా మెగాస్టార్-వెంకటేష్ కాంబోలో పడిన ప్రతి సీన్ థియేటర్లో నవ్వులు పోయించాయి. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అంటూ హిట్ ఇచ్చిన అనిల్ , ఈ ఏడాది కూడా శంకర వరప్రసాద్ తో మరో హిట్ ఇచ్చాడు. ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడం లో సక్సెస్ అయ్యాడు. చిరంజీవి నుండి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో ఆలా చూపించాడు. చిరు సిగ్గుపడటం, మొహమాటపడటం, పంచులేయడం, తన మీద తానే జోకులేసుకోవడం ఇలా సీను ఏదైనా చూసిన ప్రతిసారి మెగాస్టార్‌ని ఇలా చూసి ఎన్నాళ్లయిందిరా అని ఆడియన్స్‌కి అనిపిస్తుంది
భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ వినడానికే కాదు చూడటానికి కూడా స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించాయి.. వినిపించాయి. ఇక బీజీఎమ్ కూడా ఎక్కడ ఎంత కావాలో అక్కడ అంత చాలా పద్ధతిగా ఇచ్చాడు. ఇక కేథరిన్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్థన్, అభినవ్ గోమఠం, రఘుబాబు ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో హిట్ కొట్టింది.