Mega157 : వింటేజ్ లుక్ లో ‘మన శంకర వరప్రసాద్ ‘ అదరగొట్టాడు
Mega157 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "పండగకి వస్తున్నారు" అనే ట్యాగ్‌లైన్ పెట్టి, మెగాస్టార్ వింటేజ్ లుక్‌ను తెరపై చూపించారు. సూట్, బూట్లతో పాటు నోట్లో సిగరెట్‌తో స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గ్లింప్స్‌లో కనిపించడం అభిమానుల్లో భారీగా అంచనాలను పెంచింది
- By Sudheer Published Date - 03:25 PM, Fri - 22 August 25

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బహుమతిగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్‌లైన్ పెట్టి, మెగాస్టార్ వింటేజ్ లుక్‌ను తెరపై చూపించారు. సూట్, బూట్లతో పాటు నోట్లో సిగరెట్‌తో స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గ్లింప్స్‌లో కనిపించడం అభిమానుల్లో భారీగా అంచనాలను పెంచింది. విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ గ్లింప్స్‌కు మరింత ప్రత్యేకత వచ్చింది.
Warangal Airport : ఎకరానికి రూ.1.20 కోట్లు జమ
అయితే టైటిల్ గ్లింప్స్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi) సిగరెట్ తాగుతున్న సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువత ఇప్పటికే ధూమపానం అలవాటు వల్ల నష్టపోతున్న ఈ సమయంలో మెగాస్టార్‌ను ఇలాగే చూపించడం సరైంది కాదని చాలా మంది అంటున్నారు. పైగా 70 ఏళ్ల వయసులో ఉన్న బాస్‌ను స్మోకింగ్ లుక్‌లో చూపించడం అనవసరమని కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ, వింటేజ్ “శంకర్ దాదా ఎం.బీ.బీ.ఎస్” స్టైల్‌లో మెగాస్టార్‌ను చూపించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడనే అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పట్ల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. మెగాస్టార్ 70వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లో ఆసక్తి పెంచగా, అసలైన చిత్రంలో ఎలాంటి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తారో చూడాలి.