Devara : ‘దేవర’లో మరో విలన్.. ఎన్టీఆర్ కోసం మలయాళం స్టార్..
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. దేవర సినిమాలో మరో విలన్ ఉండబోతున్నట్టు సమాచారం. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ మలయాళ నటుడు లీక్ చేసేశాడు.
- Author : News Desk
Date : 22-06-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ 30వ సినిమా మొదలుపెట్టాడు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30(NTR 30)వ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కొరటాల శివ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది, సముద్రం తీరం వెంబడి ఉండే కథ, ఫుల్ మాస్, వయొలెన్స్ గా ఉంటుంది అని సినిమాపై ఇంకా అంచనాలు పెంచేశాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. దేవర సినిమాలో మరో విలన్ ఉండబోతున్నట్టు సమాచారం. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ మలయాళ నటుడు లీక్ చేసేశాడు.
మలయాళంలో పలు సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించిన షైన్ టామ్ చాకో ఇటీవల నాని దసరా సినిమాలో విలన్ గా మెప్పించాడు. ఇప్పుడు షైన్ టామ్ చాకో దేవరలో కూడా విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఆయన ఫ్యాన్స్ చేసిన ఓ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని బయటపెట్టాడు షైన్ టామ్ చాకో. దేవరలో తనకు కూడా నటిస్తున్నట్టు చెప్పేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత సంతోషిస్తున్నారు.
Also Read : Manoj Bajpayee : అక్కడ మద్యం ఫ్రీ అని తెలిసి పెగ్గు మీద పెగ్గు లేపేసిన మనోజ్ బాజ్‌పాయ్.. ఎక్కడో తెలుసా?