Director Passed Away: మరో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్ (31) (Joseph Manu James) ఆదివారం కన్నుమూశారు. సమాచారం.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు.
- Author : Gopichand
Date : 28-02-2023 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్ (31) (Joseph Manu James) ఆదివారం కన్నుమూశారు. సమాచారం.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. ఇటీవల మను ఆరోగ్యం విషమించడంతో అతన్ని ఎర్నాకులంలోని రాజగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతనికి న్యుమోనియా ఉందని చెప్పారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా జేమ్స్ ను కాపాడలేకపోయారు.
Also Read: Earthquake: మణిపూర్‌లో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
బాధాకరమైన విషయమేమిటంటే.. అతను తన మొదటి చిత్రాన్ని తెరపై చూడలేకపోయాడు. అతని చిత్రం నాన్సీ రాణి బాక్సాఫీస్ వద్ద త్వరలో విడుదల కానుంది. కానీ అంతకుముందే అతను ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు. జోసెఫ్ తన కెరీర్‌ని 2004లో ప్రారంభించాడు. సాబు జేమ్స్ ‘ఐ యామ్ క్యూరియస్’ చిత్రంలో బాలుడి పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఆయన పలు మలయాళ, హిందీ, కన్నడ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు `నాన్సీ రాణి` చిత్రంతో దర్శకుడిగా మారాడు. డైరెక్టర్ జోసెఫ్ మరణంతో మాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జోసెఫ్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.