Malavika Mohanan : రాజా సాబ్ బ్యూటీ అందాలతో రఫ్ఫాడించేస్తుంది..!
Malavika Mohanan మలయాళంలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న మాళవిక మోహనన్ అటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.
- Author : Ramesh
Date : 24-05-2024 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
Malavika Mohanan మలయాళంలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న మాళవిక మోహనన్ అటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే తెలుగులో అమ్మడు ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా బిజీ అవ్వాలని చూస్తుంది మాళవిక. సినిమా షూటింగ్ గ్యాప్ లో ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది అమ్మడు.
మాళవిక మోహనన్ ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఫాలోవర్స్ కోసం అమ్మడు రోజుకొక ఫోటో షూట్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా లైట్ ఎల్లో కలర్ డ్రెస్ తో తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది అమ్మడు. తన పరువాలను ప్రదర్శిస్తూ ఆడియన్స్ ఫోకస్ ని తన మీద నుంచి షిఫ్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతుంది.

సినిమాల కన్నా ఫోటో షూట్స్ తోనే మాళవిక ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది. రాజా సాబ్ సినిమా రిలీజ్ కాకుండానే తెలుగులో అమ్మడికి ఒక రేంజ్ పాపులారిటీ వచ్చింది. ఇక రాజా సాబ్ రిలీజ్ తర్వాత అమ్మడిని ఆపడం కష్టమని చెప్పొచ్చు. ప్రభాస్ రాజా సాబ్ తో మాళవిక టాలీవుడ్ లోకి గ్రాండ్ గా వెల్కం ఇస్తుంది. సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ తో కూడా మాళవిక మోహనన్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.
Also Read : Rashmika : ఎన్టీఆర్ తో నేషనల్ క్రష్.. కాంబో ఫిక్స్ అయినట్టేనా..?